ఆ పెద్దలు త్రిష గోడవను పట్టించుకోరే..?
నేరుగా త్రిష సైతం మన్సూర్ వ్యాఖ్యలపై రియాక్ట్ అవుతూ ఆడవాళ్ళపై గౌరవం లేని అలాంటి వ్యక్తితో భవిష్యత్తులో సినిమా చేయనని ప్రకటించారు.
సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ పై తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. లియో సినిమాలో త్రిషని రేప్ చేసే సీన్ లేకపోవడం బాధపడ్డా అంటూ ఆయన మీడియా ముందు చేసిన కామెంట్స్ ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. ఈ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అయ్యాయి. నేరుగా త్రిష సైతం మన్సూర్ వ్యాఖ్యలపై రియాక్ట్ అవుతూ ఆడవాళ్ళపై గౌరవం లేని అలాంటి వ్యక్తితో భవిష్యత్తులో సినిమా చేయనని ప్రకటించారు.
ఇక త్రిషకి చాలా మంది సెలబ్రిటీలు మద్దతుగా నిలబడి మన్సూర్ ఆలీఖాన్ వ్యాఖ్యలని ఖండించారు. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లియో సినిమా దర్శకుడు లోకేష్ కనగరాజ్ కూడా మన్సూర్ వ్యాఖ్యలని ఖండించి త్రిషకి మద్దతుగా నిలబడ్డారు. అలాగే దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు, గాయని చిన్మయి శ్రీపాద కూడా మద్దతుగా స్వరం విప్పింది.
అయితే మన్సూర్ ఆలీఖాన్ చేసిన వ్యాఖ్యలని ఇతర ఇండస్ట్రీలకి చెందిన నటీనటులు ఖండించారు. కోలీవుడ్ లో కూడా కొంతమంది త్రిషకి మద్దతుగా నిలబడ్డారు. కోలీవుడ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి కానీ, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కాని మన్సూర్ చేసిన వ్యాఖ్యలని ఖండించడం, అతనిపై చర్యలు తీసుకోవడం చేయలేదని గాయని చిన్మయి విమర్శలు చేశారు. అసలు ఈ విషయం ఇండస్ట్రీ పెద్దలు ఎందుకు సైలెంట్ గా ఉన్నారో చెప్పాలని ప్రశ్నించారు.
అయితే కోలీవుడ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఆర్టిస్ట్స్ అసోసియేషన్ స్పందించకపోయిన నేషనల్ విమెన్స్ కమిషన్ సుమోతోగాగా అతని వ్యాఖ్యలని పరిగణంలోకి తీసుకొని కేసు నమోదు చేయాలనీ తెలంగాణ డీజీపీని ఆదేశించింది. ఐపీసీ సెక్షన్ 509బి, ఇతర సంబంధిత చట్టాలను ప్రయోగించాలని డీజీపీని ఆదేశించింది.
ఇలాంటి వ్యాఖ్యలు మహిళలపై హింసను ప్రేరేపిస్తాయని, వాటిని ఖండించాల్సిన అవసరం ఉందని అందుకే సుమోటోగా తీసుకొని చర్యలకి ఆదేశించినట్లు మహిళ కమిషన్ ప్రకటించింది. అయితే తాను చేసిన వ్యాఖ్యలని ఎడిట్ చేసి తప్పుగా చూపించారని, కావాలని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మన్సూర్ ఆలీఖాన్ క్లారిటీ ఇచ్చారు. నిజానికి తాను ఆ ప్రెస్ మీట్ లో త్రిషని అభినందించానని చెప్పుకొచ్చారు.