జయసుధ భక్తుడిని..అందుకే క్షమాపణలు!
సీనియర్ రైటర్ తోటపల్లి మధు ఇటీవలే పాత తరం నటుల్ని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే
సీనియర్ రైటర్ తోటపల్లి మధు ఇటీవలే పాత తరం నటుల్ని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వాళ్ల వ్యక్తిగత జీవితాలు..జీవిన విధానం గురించి..ఆఫ్ ది స్క్రీన్ వ్యవహారాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసారు. ఇవన్నీ వాళ్లతో ఉన్న చనువు కారణంగానే తోటపల్లి ఆ ఛాన్స్ తీసుకున్నారు. దాసరి నారాయణరావు నుంచి మురళీమోహన్ , జయసుధ , కోడి రామకృష్ణ, జయప్రద, శ్రీదేవి, సావిత్రి ఇలా పలువు గురించి ఆయన మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ గా మారాయి.
అయితే ఆయన వ్యాఖ్యల పట్ల వాళ్ల అభిమానుల అసహనానికి గురయ్యారు. దీంతో తాజాగా తోటపల్లి కెమెరా ముందుకొచ్చి అభిమానులందరికీ క్షమాపణలు తెలియజేసారు. ఈ సందర్భంగా మరో ఇంటర్వ్యూలో ఇలా స్పందించారు. `మా ఇంట్లో ఒక్కొక్కరూ ఒక్కో హీరోను అభిమానిస్తారు. కానీ అందరూ కలిసి అభిమానించే హీరోయిన్ జయసుధ గారు. ఆమె నటించిన ఆరు సినిమాలకు నేను పనిచేశాను. ఒక్క మాటలో చెప్పాలంటే నేను జయసుధ గారికి వీరాభిమానిని మాత్రమే కాదు.
ఆమెకి గొప్ప భక్తుడిని. ఈ వేదిక ద్వారా ఆమెకి నేను వెయ్యిసార్లు క్షమాపణలు చెబుతున్నాను. కోడి రామకృష్ణగారు నా గురువుగారు . నా స్క్రీన్ నేమ్ ఇంటిపేరుతో కలిపి పెట్టుకోమని చెప్పిందే ఆయనే. ఆయనతో 20 సినిమాలకు కలిసి పనిచేశాను. ఆయన గురించి మాట్లాడుతు న్నప్పుడు, మేటర్ పక్కకి వెళ్లడం వలన ఆ టాపిక్ మధ్యలో ఆగిపోయింది. దాంతో అంతా అపార్థం చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులు బాధపడ్డారు. వాళ్లను క్షమించమని అడుగుతున్నాను` అని అన్నారు.
దీంతో అభిమానులు కూడా క్షమాపణల్ని స్వాగతిస్తున్నారు. తోటపల్లి రచయితగా, నటుడిగా తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితుడు. 1980వ దశకం నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. `దేవాంతకుడు` సినిమాతో ఆయన ప్రయాణం మొలైంది. అటుపై ఎన్నో సినిమాలకు రచన చేసారు. నటుడిగా `మాయా బజార్` సినిమాతో మ్యాకప్ వేసుకున్నారు. ప్రస్తుతం నటుడిగా అవకాశాలు వస్తే చేస్తున్నారు.