కంబ్యాక్ తోనైనా మెరుస్తారా?
శ్రీను వైట్ల సినిమా రిలీజ్ అవ్వడానికి ఇంకా సమయం పడుతుంది. కానీ శ్రీకాంత్ అడ్డాల..అజయ్ భూపతి మాత్రం రిలీజ్ కి రెడీ గా ఉన్నారు.
లైమ్ లైట్ లో లేని దర్శకుడు మళ్లీ పట్టాలెక్కడం అంటే అంత ఈజీ కాదు. సెకెండ్ ఛాన్స్ రావడం అన్నది చాలా కష్టమైన పని. లక్ తో పాటు...హీరోలు..నిర్మాతలు నమ్మితే తప్ప! సాధ్యమయ్యేది కాదు. ఆ విషయం లో శ్రీనువైట్ల ఎంత లక్కీ అన్నది తెలిసిందే. ఒకదాని తర్వాత ఒకటి ప్లాప్ ఇచ్చినా అవకాశం వచ్చింది. తాజాగా ఐదేళ్ల గ్యాప్ అనంతరం మళ్లీ మ్యాచో స్టార్ గోపీచంద్ అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఐదేళ్ల గా ఏ హీరో అవకాశం ఇవ్వలేదు. శ్రీనువైట్ల చాలా ప్రయత్నాలు చేసారు. చివరిగా గోపీచంద్ అవకాశం కల్పించడంతో ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చింది. ఇక శ్రీకాంత్ అడ్డాలకి సెకెండ్ ఛాన్స్ రావడానికి ఏకంగా ఏడేళ్లు పట్టిందనే అనాలి. 'బ్రహ్మోత్సవం' తర్వాత ఐదేళ్లు కనిపించలేదు. ఈ నేపథ్యంలోనే 'అసురన్' రీమేక్ చేసాడు. కానీ ఆ సినిమా ద్వారా అతనికి అంత పేరు రాలేదు. పైపెచ్చు మక్కీకీ మక్కీ దించేసాడని విమర్శ మిగిలింది.
'పెదకాపు' అవకాశం వచ్చిందంటే? శ్రీకాంత్ అడ్డాల గత సక్సెస్ లు మాత్రమే తెచ్చిన పెట్టిన ఛాన్స్ గా చెప్పాలి. అయితే అసురన్ తో కొత్త మేకింగ్ స్టైల్ నేర్చుకున్నాడు. అది పెదకాపుకు పనికొచ్చింది. అలాగే యువ డైరెక్టర్ అజయ్ భూపతి 'ఆర్ ఎక్స్ 100' తో మెరుపులా దూసుకొచ్చినా.. 'మహా సముద్రం ' మునిగిపోక తప్పలేదు. ఆ సినిమా పరాజయంతో అవకాశం కష్టమైంది. రెండేళ్లు గ్యాప్ తీసుకుని పాయల్ రాజ్ పూత్ లీడ్ రోల్ లో 'మంగళవారం' తెరకెక్కిస్తున్నాడు.
ఈసినిమా విజయం పై చాలా ధీమగానూ ఉన్నాడు. ఇలా ఈ ముగ్గురు మూడు రకాల సినిమాలతో మళ్లీ కంబ్యాక్ అవుతున్నారు. శ్రీను వైట్ల సినిమా రిలీజ్ అవ్వడానికి ఇంకా సమయం పడుతుంది. కానీ శ్రీకాంత్ అడ్డాల..అజయ్ భూపతి మాత్రం రిలీజ్ కి రెడీ గా ఉన్నారు. ప్రాజెక్ట్ లపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రిలీజ్ అయిన ఆ సినిమాల ప్రచార చిత్రాలతో హైప్ బాగానే క్రియేట్ అయింది. మరి వీటితో ఎలాంటి ఫలితాలు సాధిస్తారో చూడాలి.