టైగర్ నాగేశ్వరరావు.. అసలు కథ కాదన్నమాట
అయితే నిన్నటి వరకు కూడా అందరూ ఈ సినిమా టైగర్ నాగేశ్వరరావు రియల్ లైఫ్ కు దగ్గరగా ఉంటుంది అని అనుకున్నారు.
స్యూవర్ట్ పురం గజదొంగ, పేరు మోసిన టైగర్ నాగేశ్వరరావు జీవితం గురించి అప్పట్లో ఊహించని కథనాలు ఎన్నో వచ్చాయి. అతనికి ఆ గ్రామంలోనే ఎంతోమంది ఫాన్స్ ఉన్నారు. అతను చనిపోయినప్పుడు వంతిమ యాత్రలోనే వేలాది మంది పాల్గొన్నారు. ఉన్నవాడి నుంచి దోచుకుని లేనివాడికి ఇస్తూ ఒక రాబిన్ హుడ్ తరహాలో అతను జీవితాన్ని గడిపినట్లుగా చెబుతూ ఉంటారు.
అయితే అతని జీవితం ఆధారంగా చేసుకుని టైగర్ నాగేశ్వరరావు సినిమా రాబోతున్నట్లుగా అందరూ అనుకున్నారు. ఈ సినిమాలో రవితేజ లుక్ కూడా నెవర్ బిఫోర్ అనేలా చాలా డిఫరెంట్ గా ఉండడంతో అంచనాలు అమాంతంగా పెరిగిపోయాయి. ఫస్ట్ లుక్ టీజర్ తో పాటు పోస్టర్స్ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి.
అయితే నిన్నటి వరకు కూడా అందరూ ఈ సినిమా టైగర్ నాగేశ్వరరావు రియల్ లైఫ్ కు దగ్గరగా ఉంటుంది అని అనుకున్నారు. కానీ ట్రైలర్ చూసిన తర్వాత ఇది అసలు కథ కాదు అని అర్థమవుతుంది. టైటిల్ తీసుకున్నంత మాత్రాన ఎలాంటి ఇబ్బందులు రావు. అంతేకాకుండా చిత్ర యూనిట్ కూడా ఇది రియల్ ఇన్సిడెంట్స్ ద్వారా తెరపైకి రాబోతోంది అని చెప్పింది కానీ గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ అనే ఎక్కడా చెప్పలేదు.
కానీ కథలో మాత్రం దాదాపు అతనికి జీవితానికి సంబంధించిన అంశాలే ఎక్కువగా హైలెట్ కాబోతున్నాయి. ట్రైలర్లో గమనిస్తే టైగర్ నాగేశ్వరరావు పాత్ర ఏకంగా సీఎం పీఎం లెవల్లో కనెక్షన్స్ ఉన్నాయి అన్నట్లుగా ప్రజెంట్ చేశారు. ఇక దర్శకుడు వంశీ కమర్షియల్ యాంగిల్ ను ఎక్కువగా వాడుకున్నట్లు అర్థమవుతుంది.
రేణు దేశాయ్ లవణం హేమలత పాత్ర కూడా ఒరిజినల్ క్యారెక్టర్ నుంచి తీసుకున్నదే కానీ ఆమె క్యారెక్టర్ కూడా అందుకు భిన్నంగా ఈ సినిమాలో ఉండబోతున్నట్లు అనిపిస్తోంది. ఇక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ కూడా కంప్లీట్ ఫిక్షన్ అని కూడా తేల్చేశారు. నిజ జీవితంలో అయితే టైగర్ నాగేశ్వరరావు ఒక అమ్మాయి మోసం చేయడం వలన పోలీసులకు చిక్కుతాడు.
ఇక వారి చేతుల్లోనే అతను ఎన్కౌంటర్ అవుతాడు. అతని సన్నిహితులు కూడా చాలా ఇంటర్వ్యూలలో అతను గొప్పగా చేసింది ఏమీ లేదు అని చెన్నైలో ఒకసారి పెద్ద గోడ దూకినప్పుడు అతనికి టైగర్ నాగేశ్వరరావు అనే పేరు వచ్చింది అన్నట్లుగా చెబుతున్నారు. మరి సినిమాలో దర్శకుడు వంశీ అప్పటి అంశాలను హైలెట్ చేస్తూ ఫిక్షనల్ గా నాగేశ్వరరావు పాత్రను హైలెట్ చేస్తాడా లేదంటే రీయల్ క్యారెక్టర్ ను సగం వరకే చూపిస్తాడా అనేది సినిమా రిలీజ్ తరువాత తెలుస్తుంది.