టైగర్ నాగేశ్వరరావు దండయాత్ర షురూ.. గూస్ బంప్స్!
మాస్ మహారాజ రవితేజ ఈసారి టైగర్ నాగేశ్వరరావు సినిమాతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త సందడి క్రియేట్ చేయబోతున్నాడు అని అర్థమవుతుంది
మాస్ మహారాజ రవితేజ ఈసారి టైగర్ నాగేశ్వరరావు సినిమాతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త సందడి క్రియేట్ చేయబోతున్నాడు అని అర్థమవుతుంది. ఈ సినిమాను అనౌన్స్ చేసినప్పుడే అందరిలో అంచనాలు పెరిగిపోయాయి. అయితే దర్శకుడు వంశీ ఇప్పటివరకు ఇలాంటి జానర్ లో పెద్దగా సినిమా చేసింది లేదు. దీంతో అతను సరైన న్యాయం చేయగలడా లేదా అనే అనుమానాలు కూడా చాలానే వచ్చాయి.
అయితే రవితేజ అతన్ని నమ్మడం కరెక్టే అని ఇప్పుడు విడుదలైన ఒక ఇన్వాషన్ వీడియో చూస్తే అర్థమవుతుంది. లేటెస్ట్ గా సినిమాకు సంబంధించిన ఆ దండయాత్ర వీడియోను విడుదల చేశారు. ఈ సినిమాలో టైగర్ నాగేశ్వరరావు పాత్రను ఊహించని స్థాయిలోనే ప్రజెంట్ చేయడం జరిగింది. స్టువర్టుపురం గజదొంగగా ఒకప్పుడు పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన టైగర్ నాగేశ్వరరావు గురించి అందరికీ తెలిసే ఉంటుంది.
అయితే అతని కథను మరింత లోతుగా హైలెట్ చేసేలా వెండితెరపైకి తీసుకురాబోతున్నారు. ఇక ఇదివరకే ఫస్ట్ లుక్ పోస్టర్ ను గ్రాండ్గా విడుదల చేశారు. ఇక ఇప్పుడు మొదటి టీజర్ ను ప్రజెంట్ చేసిన విధానం కూడా హైలెట్ అవుతోంది. టీజర్ చూస్తుంటే ఇందులో టైగర్ నాగేశ్వరరావు చాలా పవర్ ఫుల్ గా కనిపించబోతున్నట్లు అనిపిస్తోంది.
దేశం ప్రధాన నగరాల్లో అతి దారుణమైన దోపిడీలు చేసిన ఒక స్టువర్టుపురం దొంగ మద్రాస్ సెంట్రల్ జైలు నుంచి తప్పించుకున్నాడు అనే వార్తతో ఈ సినిమా వీడియో మొదలవుతుంది. ఇక అందులో ఇప్పటివరకు ఏ సౌత్ దొంగ కూడా ఈ జైలు నుంచి తప్పించుకోలేదని పోలీస్ చెప్పడం, ఆ తర్వాత మురళీ శర్మ ఎంట్రీ తో టైగర్ జోన్ లోకి ప్రవేశించాలి అని చెప్పడంతోనే అతని పాత్రను చాలా పవర్ఫుల్గా హైలెట్ చేశారు.
ఇక టైగర్ నాగేశ్వరరావు పాలిటిక్స్ లోకి వెళ్లి ఉంటే వాడి తెలివితేటలతో ఎలక్షన్స్ లో గెలిచేవాడు, స్పోర్ట్స్ లోకి వెళ్లి ఉంటే వాడి పరుగుతో ఇండియాకు మెడల్ తెచ్చేవాడు, ఆర్మీలోకి వెళ్లి ఉంటే వాడి ధైర్యంతో ఒక యుద్ధమే గెలిచేవాడు. అనుకోకుండా అలాంటి వ్యక్తి ఒక క్రిమినల్ అయ్యాడు అని మురళీ శర్మ ఇచ్చిన డీటెయిల్స్ తోనే క్యారెక్టర్ ను ఎక్కడికో తీసుకువెళ్లారు.
ఇక ఇందులో టైగర్ నాగేశ్వరరావు యాక్షన్ ఎలిమెంట్స్ తో కూడా స్టన్ అయ్యేలా ఉండబోతున్నట్లు అర్థమవుతుంది. మొత్తానికి ఈ టీజర్ అయితే సినిమాపై అంచనాల స్థాయిని అమాంతంగా పెంచేసిందే. ఈ సినిమాలో అనుపమ్ ఖేర్ కూడా ఒక ఐబీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఈ సినిమాకు జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా అభిషేక అగర్వాల్ ఆర్ట్స్ లో భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మిస్తున్నారు. TNR ను పాన్ ఇండియా రేంజ్ లో అక్టోబర్ 10న విడుదల చేయనున్నారు.