టిల్లు ఇప్పుడప్పుడే ఆగేలా లేడు..!

ఈమధ్య టిల్లు స్క్వేర్ ట్రైలర్ చూస్తే అదే మేనరిజం అదే పంచులతో టిల్లు మరోసారి మ్యాజిక్ రిపీట్ చేసేలా ఉన్నాడు.

Update: 2024-02-20 07:30 GMT

టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ ఏంటంటే కథ కన్నా క్యారెక్టరైజేషన్ మీద సినిమాలు చేసేస్తున్నారు. సినిమాలో హీరో పాత్ర ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యి అది ఎమోషన్, ఫన్, యాక్షన్ ఇలా ఏ యాస్పెక్ట్ లో అయినా వారికి ఎక్కేస్తే చాలు ఆ సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేసేస్తున్నారు ఆడియన్స్. కోట్ల కొద్దీ బడ్జెట్ పెట్టి చేసే భారీ సినిమాల్లోనే కాదు లిమిటెడ్ బడ్జెట్ తో చేసే మీడియం రేంజ్ సినిమాల్లో కూడా ఈ పంథా కొనసాగిస్తుంది. ఈ క్రమంలో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన డీజే టిల్లు ఆడియన్స్ కి పిచ్చెక్కించేశాడు. సిద్ధు క్యారెక్టరైజేషన్ ఆడియన్స్ ని ఫిదా చేసింది.

క్లాసు మాసు అనే తేడా లేకుండా ఆ పాత్రలో సిద్ధు పంచులు ఫుల్లుగా ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా సినిమాను ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఎంటర్టైన్ అయ్యారు. అందుకే డీజే టిల్లు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ ని రెడీ చేశారు. ఈమధ్య టిల్లు స్క్వేర్ ట్రైలర్ చూస్తే అదే మేనరిజం అదే పంచులతో టిల్లు మరోసారి మ్యాజిక్ రిపీట్ చేసేలా ఉన్నాడు. టిల్లు స్క్వేర్ లో అదనంగా అనుపమ గ్లామర్ డోస్ ఆడియన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టేలా ఉంది.

అయితే టిల్లు క్యారెక్టరైజేషన్ కి సిద్ధు పర్ఫెక్ట్ గా సూట్ అవ్వడమే కాదు ఎప్పటికీ బోర్ కొట్టని పాత్రలా అనిపిస్తుంది. అందుకే ఈ రోల్ ని ఇలా ముగించకుండా టిల్లు స్క్వేర్ మాత్రమే కాదు క్యూబ్, ఫోర్ స్క్వేర్ ఇలా సినిమాలు కొనసాగిస్తే బాగుంటుందని ఆడియన్స్ అంటున్నారు. టిల్లు స్క్వేర్ సూపర్ హిట్ అయితే కచ్చితంగా ఆ సినిమా మేకర్స్ కూడా ఇదే ప్లానింగ్ తో ముందుకెళ్తారని చెప్పొచ్చు. డీజే టిల్లు ఏ ముహూర్తాన మొదలు పెట్టారో కానీ సిద్ధు కెరీర్ ని సెట్ అయ్యేలా చేసింది.

లేటెస్ట్ గా రిలీజైన టిల్లు స్క్వేర్ సినిమా కూడా ఫుల్ ఫన్ అండ్ ఎంటర్టైన్ అని తెలుస్తుంది. డీజే టిల్లు ని విమల్ కృష్ణ డైరెక్ట్ చేయగా టిల్లు స్క్వేర్ ని మల్లిక్ రామ్ డైరెక్ట్ చేశారు. ఈ రెండు సినిమా కథ, మాటల్లో సిద్ధు జొన్నలగడ్డ ప్రమేయం కూడా ఉందని తెలుస్తుంది. టిల్లు స్క్వేర్ సక్సెస్ అయితే తప్పనిసరిగా టిల్లు ఫ్రాంచైజ్ కొనసాగుతుందని కచ్చితంగా చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Tags:    

Similar News