'టిల్లు స్క్వేర్‌' కి డైరెక్ట‌ర్ ఎందుకు మారాడు?

అయితే ద‌ర్శ‌కుడి మార్పున‌కు కార‌ణ‌మేమిటి? అంటే.. దానికి చిత్ర క‌థానాయ‌కుడు సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ నుంచి స‌మాధానం వ‌చ్చింది.

Update: 2024-03-19 04:58 GMT

యూత్ ఫుల్ ఎంట‌ర్ టైన‌ర్ `డీజే టిల్లు` గా న‌టించి గొప్ప‌గా అల‌రించాడు సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌. యూత్ లో అత‌డికి విప‌రీత‌మైన ఫాలోయింగ్ పెంచిన చిత్ర‌మిది. అందుకే ఇప్పుడు డీజే టిల్లుకి సీక్వెల్ విడుద‌ల‌కు వ‌స్తోంది అన‌గానే స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. సిద్ధు- అనుప‌మ జంట‌గా న‌టించిన ఈ సినిమాకి పార్ట్ 1 తెర‌కెక్కించిన దర్శ‌కుడు విమ‌ల్ ని ఎంపిక చేయ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. సిద్ధూ అనే న‌టుడికి గొప్ప ఇమేజ్ ని తెచ్చిన టిల్లు పాత్ర‌కు కార‌కుడైన‌ విమ‌ల్ ఎందుకు మాయ‌మ‌య్యాడు? డైరెక్ట‌ర్ విమ‌ల్ తో చిత్ర‌బృందానికి క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ వ‌చ్చాయా? అంటూ ఒక సెక్ష‌న్ మీడియా సందేహాలు వ్య‌క్తం చేసింది.

అయితే ద‌ర్శ‌కుడి మార్పున‌కు కార‌ణ‌మేమిటి? అంటే.. దానికి చిత్ర క‌థానాయ‌కుడు సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ నుంచి స‌మాధానం వ‌చ్చింది. డీజే టిల్లుకు సీక్వెల్ చేయాల‌న్న ఆలోచ‌న వ‌చ్చిన‌ప్పుడు అది అంత సులువు కాద‌ని మేం అనుకున్నాం. ఆల్రెడీ బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన కాన్సెప్టుకు కొన‌సాగింపు క‌థ‌తో సినిమా తీయ‌డం ఈజీ కాదు. కానీ చేయాల‌ని వంశీ అన్నా నేను నిర్ణ‌యించుకున్నాం. సీక్వెల్ ను ప్ర‌క‌టించాం.

అయితే ఈ సినిమా డిజే టిల్లుకి ప‌ని చేసిన‌ విమల్ చేయ‌కూడ‌ద‌ని అనుకోలేదు. టిల్లు స్క్వేర్ అనుకున్న‌ప్పుడు అది బిగ్ ఛాలెంజ్. మేం ఆ నిర్ణ‌యం తీసుకునేప్ప‌టికి విమ‌ల్ వేరే సినిమాకి క‌మిటైపోయాడు. అందుకే ప్యార‌ల‌ల్ క‌థ‌ను అనుకుని మ‌ల్లిక్ రామ్ ని తీసుకున్నాం. అప్ప‌టికే మ‌ల్లిక్ తో మేం వేరొక స్క్రిప్టుపై ప‌ని చేస్తున్నాం. కానీ టిల్లు స్క్వేర్ కోసం క‌లిసి ప‌ని చేసాం.. అని తెలిపారు.

ద‌ర్శ‌కుడి మార్పు స‌వాల్ కాదా? అని ప్ర‌శ్నిస్తే.. టిల్లు పాత్ర‌ను ద‌ర్శ‌కుడు చ‌క్క‌గా క్యారీ చేసాడ‌ని సిద్ధు అన్నారు. క్యారెక్ట‌రైజేష‌న్ పెర్ఫామెన్స్ కి వ‌చ్చేప్ప‌టికి ఆ పాత్ర ఎలా ఉండాలి. ఈ క‌థ‌లో ఎలాంటి పాయింట్స్ ఉండాలి అనేది మేమంతా క‌లిసి డిస్క‌ష‌న్ లో నిర్ణ‌యించాం. కొత్త‌ ద‌ర్శ‌కుడితో ముందుకు వెళ్లాం... అని కూడా అన్నారు. టిల్లు స్క్వేర్ ఈ నెల చివ‌రిలో విడుద‌ల‌వుతోంది. సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ ప‌తాకంపై నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Tags:    

Similar News