సూపర్ ఫామ్ లో టాలీవుడ్ సీనియర్స్ - ఒక్కొక్కరు ఒక్క రికార్డుతో!

బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు సాధించి తమ ఖాతాలో వేసుకుంటున్నారు సీనియర్ హీరోలు.

Update: 2025-02-08 20:30 GMT

టాలీవుడ్ ఫోర్ పిల్లర్స్.. అదేనండీ మన సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. సిక్స్ టీ ప్లస్ ఏజ్ వచ్చినా వరుస సినిమాలతో సందడి చేస్తున్నారు. ఫుల్ ఎనర్జీతో కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నారు. రీసెంట్ గా సంక్రాంతి పండుగకు సీనియర్ హీరోలే సత్తా చాటారు. తమ సినిమాలతో ఆడియన్స్ ను ఓ రేంజ్ లో అలరించారు.

బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు సాధించి తమ ఖాతాలో వేసుకుంటున్నారు సీనియర్ హీరోలు. నాగార్జున తప్ప చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్.. ముగ్గురూ రీసెంట్ గా అరుదైన ఘనతలు సాధించారు. ఒక్కొక్కరు ఒక్కో రికార్డును సొంతం చేసుకున్నారు. నాగార్జున కూడా త్వరలోనే ఏదైనా రికార్డు క్రియేట్ చేయడం గ్యారెంటీనే!

రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం మూవీతో విక్టరీ వెంకటేష్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఆ సినిమాతో మంచి హిట్ ను దక్కించుకున్నారు. బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లు సాధించిన తొలి సీనియర్ హీరోగా వెంకీ రికార్డు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.

అయితే 25 ఏళ్ల క్రితం కలిసుందాం మూవీతో చరిత్ర సృష్టించిన వెంకటేష్.. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో ఇండస్ట్రీ హిట్ ను కైవసం చేసుకున్నారని చెప్పాలి. మరోవైపు, ఎక్కువ సార్లు రూ.200 కోట్ల గ్రాస్, రూ.100 కోట్ల షేర్ అందుకున్న హీరోగా చిరంజీవి ఘనత సాధించారు. ఇప్పుడు విశ్వంభరతో బిజీగా ఉన్నారు.

రీ ఎంట్రీ ఇచ్చాక ఖైదీ నెం.150 మూవీతో రూ.100 కోట్ల షేర్ వసూలు చేసిన మెగాస్టార్.. ఆ తర్వాత సైరా నరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలతో రూ.200 కోట్ల గ్రాస్ సాధించారు. ఇప్పుడు బింబిసార ఫేమ్ వశిష్ట తెరకెక్కిస్తున్న విశ్వంభరతో కొత్త రికార్డులు క్రియేట్ చేయాలని మెగా అభిమానులు, సినీ ప్రియులు ఆశిస్తున్నారు.

అదే సమయంలో బాలయ్య ఎక్కువ సార్లు రూ.100 కోట్ల గ్రాసర్స్ సొంతం చేసుకున్న హీరోగా నిలిచారు. అఖండతో హిట్ ట్రాక్ ఎక్కిన ఆయన.. వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ తో వరుస విజయాలు సాధిస్తున్నారు. హిట్స్ తో పాటు రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబడుతున్నారు. అలా ఇప్పుడు నాగ్ పెర్ఫెక్ట్ కమ్ బ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నారు. అదే జరిగితే టాలీవుడ్ పిల్లర్స్ అంతా ఫుల్ ఫామ్ లో ఉన్నట్లే.

Tags:    

Similar News