అంద‌రూ ద‌స‌రాకే పెట్టారా? ముహూర్తం!

ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ లో రిలీజ్ చేయాల‌ని నిర్మాణ సంస్థ‌లు భావిస్తున్నాయ‌ట‌. సాధార‌ణంగా ద‌స‌రా అంటే కొత్త సినిమాల ప్రారంభోత్స‌వాల‌కు మంచి శుభ సూచికం. రిలీజ్ లు కూడా అలాగే ఉంటాయి.

Update: 2024-09-20 19:30 GMT

స్టార్ హీరోలంతా ఆన్ సెట్స్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. చిరంజీవి, బాల‌కృష్ణ‌, వెంక‌టేష్, నాగార్జున‌, విజ‌య్ దేవ‌ర‌కొండ ఇలా సీనియ‌ర్ హీరోల నుంచి జూనియ‌ర్ హీరోల వ‌ర‌కూ సెట్స్ లో ఉన్నారు. కానీ ఇందులో చిరంజీవి మినహా హీరోలు ఇంకా త‌మ టైటిల్స్ ప్ర‌క‌టించ‌లేదు. చిరంజీవి చిత్రానికి 'విశ్వ‌భ‌ర' గా టైటిల్ ఖ‌రారు చేసిన సంగ‌తి తెలిసిందే. సంక్రాంతి కానుక‌గా రిలీజ్ అవుతున్న సినిమా అప్ డేట్స్ ఇంకా రావాల్సి ఉంది.

ఇక న‌ట‌సింహ బాల‌కృష్ణ 109వ సినిమా టైటిల్ ఏదై ఉంటుంద‌ని? అభిమ‌నుల్లో ఒక‌టే ఉత్కంఠ కొన‌సాగుతుంది. బాబి దర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమాకి ఎలాంటి టైటిల్ ఫిక్స్ చేసార‌ని గెస్ చేస్తున్నారు. సాధార‌ణంగా బాల‌య్య టైటిల్స్ చాలా ప‌వ‌ర్ పుల్ గా ఉంటాయి. బాబి కూడా ప‌వ‌ర్ పుల్ టైటిల్ నే తీసుకుంటారు. ఈ నేప‌థ్యంటో టైటిల్ పై ఆస‌క్తి కొన‌సాగుతోంది. విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెర‌కెక్కుతుంది.

'సంక్రాంతి వ‌స్తున్నాం' అనే వ‌ర్కింగ్ టైటిల్ తో సెట్స్ కి వెళ్లిన అనీల్ ఇంకా టైటిల్ ప్ర‌క‌టించ‌లేదు. కూల్ గా ప‌నిచేస్తున్నాడు. మ‌రోవైపు విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా గౌత‌మ్ తిన్న‌నూరి ఓ సినిమా తెర‌కెక్కి స్తున్నారు. ఇప్ప‌టికే రిలీజ్ తేదీ కూడా ఖ‌రారు చేసుకుంది. కానీ టైటిల్ ఇంకా అనౌన్స్ కాలేదు. విజ‌య్ వ‌రుస ప‌రాజ‌యాల నేప‌థ్యంలో చేస్తోన్న సినిమా కావ‌డంతో టైటిల్ పై ఆస‌క్తి నెల‌కొంది.

ఇక కింగ్ నాగార్జున సోలో ప్రాజెక్ట్ ల గురించి ప్ర‌క‌టించాల్సి ఉంది. వ‌రుస‌గా ఆయ‌న ఇద్ద‌రు ద‌ర్శ‌కుల్ని లైన్ లో పెట్టారు. ఆ చిత్రాలు ప‌ట్టాలెక్కించే ప‌నిలో ఉన్నారు. అయితే ఈ సినిమా టైటిల్స్ అన్ని ఒకేసారి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్న‌ట్లు స‌మాచ‌రాం. ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ లో రిలీజ్ చేయాల‌ని నిర్మాణ సంస్థ‌లు భావిస్తున్నాయ‌ట‌. సాధార‌ణంగా ద‌స‌రా అంటే కొత్త సినిమాల ప్రారంభోత్స‌వాల‌కు మంచి శుభ సూచికం. రిలీజ్ లు కూడా అలాగే ఉంటాయి. ఈనేప‌థ్యంలో న‌యా స్టార్లు అంతా ఆ రోజు టైటిల్స్ తో వ‌చ్చే అవ‌కాశం ఉందంటున్నారు.

Tags:    

Similar News