టాలీవుడ్ చరిత్రలోనే మాల్దీవులు స్పాట్ ఇదే తొలిసారి!
టాలీవుడ్ హీరోలు ఫ్యామిలీతో కలిసి మాల్దీవులకు వెకేషన్ కి వెళ్లడం అన్నది పెద్దగా చోటు చేసుకోదు.
టాలీవుడ్ హీరోలు ఫ్యామిలీతో కలిసి మాల్దీవులకు వెకేషన్ కి వెళ్లడం అన్నది పెద్దగా చోటు చేసుకోదు. ఆ ప్రదేశంలో బర్త్ డే పార్టీలు లాంటివి కూడా పెద్దగా సెలబ్రేట్ చేసుకోరు. మాల్దీవులు అనేది పూర్తి బాలీవుడ్ సెలబ్రిటీల వెకేషన్ స్పాట్ గా పేరుంది. టాలీవుడ్ హీరోలైతే? అమెరికా..రష్యా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, దుబాయ్ లాంటి ప్రదేశాలకు వెళ్తుంటారు. హీరోల బర్త్ డేలు అయినా..కుటుంబ సభ్యులు బర్త్ డేలు అయినా ఆయా ప్రదేశాల్లోనే సెలబ్రేట్ చేసుకుంటారు.
టాలీవుడ్ నుంచి ఎక్కువగా వెకేషన్లకు వెళ్లేది సూపర్ స్టార్ మహేష్ ప్యామీలి మాత్రమే. ఈ మధ్య కాలంలో చిరంజీవి, నాగార్జున ఫ్యామిలీలు కూడా తరుచూ విదేశాలకు వెళ్లడం మొదలు పెట్టారు. వెంకటేష్ మాత్రం వేకే షన్లకు వెళ్తారు. కానీ ఆయన సోలోగా మాత్రమే వెళ్తారు. ఇలాంటి సెలబ్రిటీలు అందర్నీ ఒకే తాటిపైకి తీసుకొచ్చి మాల్దీవుల్లో దించాడు పారిశ్రామిక వేత్త, గ్రీన్ కో అధినేత అనీల్ కుమార్ చలమ శెట్టి.
ఆయన 50వ జన్మదినోత్సవ వేడుకలు మాల్దీవుల్లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో టాలీవుడ్ స్టార్స్ అంతా దాదాపు పాల్గొన్నారు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, మహేష్, రామ్ చరణ్ అంతా హాజరయ్యారు. పార్టీలో వాళ్ల కుటుంబాలు, పిల్లలు అంతా జాయిన్ అయ్యారు. ఇలా ఓ వ్యాపార వేత్త పార్టీ కోసం టాలీవుడ్ బిగ్ స్టార్స్ అంతా ఇలా కుటుంబాలతో వెళ్లడం అన్నది ఇదే తొలిసారి. అందులోనూ మాల్దీవులకు.
మరి ఇలా మాల్దీవుల్లో పార్టీ ఏర్పాటు చేయడం అన్నది చలమశెట్టి ప్లానా? లేక హీరోలంతా కలిసి ఆ ప్లేస్ ను చూజ్ చేసిన తర్వాత చలమశెట్టి ఫిక్స్ చేసాడా? అన్నది మిస్టరీ. ఇప్పటికే పార్టీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతోన్న సంగతి తెలిసిందే. సాధారణంగా ఇంతమంది టాప్ స్టార్లు హాజరైతే? ఆ సెలబ్రేషన్ ని బిజినెస్ గా మార్చుకునే అవకాశం ఉంది. ఏదో ఒక ఓటీటీతో ఒప్పందం కుదుర్చుకుంటే కోట్ల రూపాయలు వస్తాయి. కానీ చలమశెట్టి మాత్రం ఆ ఛాన్స్ తీసుకోలేదు. నెటి జనుల కోసం, హీరోల అభిమానుల కోసం సోషల్ మీడియాలోకి అధికారకంగా వదిలేసారు.