హార్ట్‌ సింబల్‌ తో అందమైన నిధి

సవ్యసాచి మరియు మిస్టర్ మజ్ను సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ నిధి అగర్వాల్‌.

Update: 2024-08-21 13:30 GMT

సవ్యసాచి మరియు మిస్టర్ మజ్ను సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ నిధి అగర్వాల్‌. ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రభావంను చూపించలేక పోయాయి. అయినా కూడా అందాల నిధి కి రామ్‌ కు జోడీగా ఇస్మార్ట్‌ శంకర్‌ లో పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో నటించే అవకాశం దక్కింది. ఆ సినిమా సూపర్‌ హిట్‌ అవ్వడంతో ఈ అమ్మడు టాలీవుడ్‌ లో బిజీ హీరోయిన్ గా మారి పోయింది. తెలుగు తో పాటు ఇతర భాషల సినిమాలు మరియు సిరీస్ ల్లో నటించడం ద్వారా ఈ అమ్మడు ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది.


ప్రస్తుతం నిధి అగర్వాల్‌ హరి హర వీరమల్లు సినిమాతో పాటు ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజా సాబ్‌ లో కూడా నటిస్తోంది. ఒక వైపు పవన్ కళ్యాణ్ మూవీ లో మరో వైపు ప్రభాస్ మూవీ లో నటిస్తున్న నేపథ్యం లో ఫ్యాన్స్‌ సర్‌ప్రైజ్ అవుతున్నారు. ఈ స్థాయిలో స్టార్‌ హీరోలకు జోడీగా నటిస్తున్న అందాల నిధి అగర్వాల్‌ మరో వైపు సోషల్‌ మీడియా ద్వారా రెగ్యులర్‌ గా అందమైన తన ఫోటోలను షేర్ చేస్తూ వార్తల్లో ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఈ ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

ఒక ప్రముఖ కంపెనీ ఆండ్రాయిడ్‌ మొబైల్‌ ను ప్రమోట్‌ చేయడం కోసం, ఆ మొబైల్‌ యొక్క పిక్చర్‌ క్వాలిటీ ని చూపిస్తూ ఈ ఫోటోలకు ఫోజ్ ఇచ్చింది. హార్ట్‌ సింబల్‌ పెట్టి ఫోటో కు ఫోజ్ ఇచ్చిన నిధి అగర్వాల్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గత ఏడాది కొన్ని కారణాల వల్ల ఎక్కువ సినిమాలు చేయలేక పోయిన ఈ అమ్మడు ప్రస్తుతం చేస్తున్న రెండు సినిమాల కారణంగా వరుసగా సినిమా ఆఫర్లు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి అంటూ ఆమె సన్నిహితులు ఇంకా ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

నిధి అగర్వాల్‌ తెలుగు లో చేసిన సినిమాలు గతంలో ఆమె అందాలను చూపించిన విషయం తెల్సిందే. తాజాగా షేర్ చేసిన ఈ ఫోటోలో పొట్టి గౌన్‌ లో కూడా చాలా అందంగా క్యూట్‌ గా నిధి అగర్వాల్‌ ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ముందు ముందు కూడా నిధి అగర్వాల్‌ ఇలాంటి అందమైన ఫోటో లను షేర్ చేయడం ద్వారా తప్పకుండా మరింత మంది స్టార్ హీరోల సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా టాలీవుడ్‌ లో టాప్‌ స్టార్‌ హీరోయిన్‌ గా నిలిచే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

Tags:    

Similar News