దసరా బాక్సాఫీస్... ఈ ముగ్గురి పాత్రల వల్ల నో యూజ్
ఈ దసరాకు బాలయ్య భగవంత్ కేసరి, రవితేజ టైగర్ నాగేశ్వరరావు, దళపతి విజయ్ లియో బాక్సాఫీస్ ముందు పోటీకి దిగిన సంగతి తెలిసిందే.
ఈ దసరాకు బాలయ్య భగవంత్ కేసరి, రవితేజ టైగర్ నాగేశ్వరరావు, దళపతి విజయ్ లియో బాక్సాఫీస్ ముందు పోటీకి దిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్య హద్దులు చెరిగిపోవడంతో స్టార్ బాలీవుడ్ యాక్టర్స్ సౌత్ సినిమాల్లో ఎక్కువగా నటిస్తున్నారు. ఇప్పుడీ మూడు చిత్రాల్లోనూ హిందీ నటులు కనిపించారు. కానీ ఈ బీటౌన్ యాక్టర్స్ పోషించిన పాత్రలు సినిమాకు ఎలాంటి ప్లస్‌గా నిలవకుండా పోయాయనే చెప్పాలి.
భవవంక్ కేసరిలో స్టార్ యాక్టర్ అర్జున్ రాంపాల్ నటించారు. అయితే సినిమా ప్రమోషన్స్‌లో ఆయన పాత్ర బలంగా ఉంటుందని అన్నారు. కానీ వాస్తవానికి అంత సీన్ కనిపించలేదు. మూవీలో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి ఎంతటికైనా తెగించే ఓ స్టీరియోటైపికల్ విలన్‌గా కనిపించారు. సీఎం నుంచి పీఎం వరకు మొత్తం రాజకీయ వ్యవస్థనే తన గుప్పిట్లో ఉండే ప్రతినాయకుడిగా చూపించారు. ఆయన నటన బాగానే ఉన్నప్పటికీ.. ఇప్పటికే ఇలాంటి పాత్రలను మనం చాలానే చూశాం. అదేం కొత్తగా కనిపించలేదు. బాలయ్య-శ్రీలీల నటన ఎమోషనల్ సీన్స్, యాక్టింగ్ ముందు విలన్ పాత్ర కాస్త తేలిపోయిందనే చెప్పాలి.
టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో సూపర్ టాలెంటెడ్ అనుపమ్ ఖేర్‌ను ఐబీ ఆఫీసర్‌గా చూపించారు. కానీ ఆయన క్యారెక్టర్ కథపై ఎలాంటి ప్రభావం చూపలేదు. సినిమాకు బలంగా నిలవలేదు. ఇదే పాత్రలో ఇతర రెగ్యులర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నటించినా పెద్దతా తేడా ఏమీ ఉండేది కాదు.
గ్యాంగస్టర్ లియో చిత్రంలోనూ ఇదే జరిగింది. దర్శకుడు అనురాగ్ కశ్యప్ మంచి నటుడన్న సంగతి తెలిసిందే. ఆయన పాత్రను మరింత సిల్లీగా చూపించేశారు. ఓ చనిపోయే పాత్రలో సింపుల్‌గా లాగించేశారు. అనురాగ్ కశ్యప్‌కు మరో మంచి పాత్ర ఇచ్చి ఉండే ఆయన మరింత బలంగా నటించేవారు. ఆయన్ను లియో మూవీటీమ్.. సరిగ్గా వాడుకోలేదనిపించింది.
మొత్తంగా ఈ మూడు చిత్రాల్లోనూ ఫేమస్ బాలీవుడ్ యాక్టర్స్ అద్భుతంగా నటించారనే కానీ.. ఎవరీ పాత్ర కూడా అంతగా సినిమాకు బలంగా నిలవలేదు! దర్శకులు ఈ ముగ్గురి పాత్రలను బలంగా తీర్చిదిద్దలేదనే చెప్పాలి.