టాలీవుడ్.. మరో వెయ్యి కోట్ల దర్శకుడు లేడా?
మరి జక్కన్న మినహా మిగితా తెలుగు దర్శకులకు ఇంకా అది ఎందుకు సాధ్యం కాలేదో.
ఒకప్పుడు తెలుగు సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లు కొల్లగొడితే చాలా గొప్పగా చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు దర్శకధీరుడు రాజమౌళి చరిత్రను తిరగరాసి.. రూ.1000కోట్ల మార్కెట్ దాటేలా చేశారు. ఆర్ఆర్ఆర్, బాహుబలి 2 లాంటి చిత్రాలతో తెలుగువారు గర్వించదగ్గ ఘట్టం దేశ సినీ చరిత్రలో ఆవిష్కరణ జరిగింది. ఇక్కడి దాకా కథ బాగానే ఉంది. మరి ఆర్ఆర్ఆర్ తర్వాత టాలీవుడ్లో ఆ రేంజ్ వసూళ్లు సాధించిన సినిమా ఏంటి? అంటే సమాధానం దొరకదు.
ఎందుకంటే ఆ రేంజ్ సినిమా ఇప్పటివరకు రాలేదు. రాజమౌళి రూ.1000కోట్ల మార్కెట్‌కు బాటలు వేసినా.. ఆ తర్వాత ఏ తెలుగు, హీరో, దర్శకుడు కూడా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కనీసం రూ.500కోట్ల గ్రాస్ వసూళ్లను అందుకోలేదు. సాహో, పుష్ప పాన్ ఇండియా రేంజ్లో విజయం సాధించినప్పటికీ అవేమి రూ.500కోట్లు అందుకోలేదు.
మరి దీనికి కారణం ఏంటి? అంటే.. జక్కన్న మినహా ఇతర ఏ తెలుగు దర్శకుడు కూడా ఆ దిశగా అడుగులు వేయడానికి గట్టిగా ప్రయత్నించట్లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. సుకుమార్ పుష్పతో మంచి ప్రయత్నమే చేసినప్పటికీ.. ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్లో భారీ హిట్ అవుతుందని తాను కూడా ఊహించలేదని చెప్పారు. అంటే పాన్ ఇండియా స్థాయిలో భారీ హిట్ అవ్వాలని ఆయన ఎఫర్ట్ పెట్టి తీయలేదని అని అర్థమైంది.
ఓ మంచి బ్లాక్ బాస్టర్ హిట్ అయితే చాలని మాత్రమే ఆశించారు. ప్రస్తుతం పుష్ప 2 కోసం మాత్రం ఆ ఎఫర్ట్‌తోనే చేస్తున్నారు. కానీ దీని రిజల్ట్ ఎలా ఉంటుందో. ఇక త్రివిక్రమ్ సినిమా కనీసం ఇప్పటివరకు పాన్ ఇండియా రేంజ్లో కూడా రాలేదు. ఇతర దర్శకులది ఇదే సంగతి.
కానీ పక్క భాషల దర్శకుల విషయానికొస్తే.. కన్నడలో ప్రశాంత్ నీల్ ఇప్పటికే కేజీయఫ్‌తో, కోలీవుడ్‌లో అట్లీ జవాన్‌తో రూ.1000కోట్ల మార్కెట్‌ను అందుకున్నారు. మరి జక్కన్న మినహా మిగితా తెలుగు దర్శకులకు ఇంకా అది ఎందుకు సాధ్యం కాలేదో.. ఫైనల్‌గా మళ్లీ తెలుగులో తన రికార్డ్ తానే బ్రేక్ చేసుకునేందుకు రాజమౌళి సిద్ధం అవుతున్నారు. మహేశ్‌బాబుతో పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ రెడీ చేస్తున్నారు.