2024-ఈ దర్శకుల పరిస్థితి ఏంటి ?

వారి పని అయిపోయింది అని విమర్శలు ఎదుర్కొని, ఆ తరువాత బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు.

Update: 2024-05-10 03:52 GMT

టాలెంటెడ్ దర్శకులుగా గుర్తింపు తెచ్చుకొని తరువాత ఒక్క ఫ్లాప్ తో కెరియర్ పరంగా ఇబ్బందులు ఎదురుకొన్న వారు ఇండస్ట్రీలో చాలా మంది ఉంటారు. అలాంటి దర్శకులు మళ్ళీ తమ టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవడానికి ఒక్క మూవీ కోసం వెయిట్ చేస్తారు. నెక్స్ట్ చేసే సినిమాలతో బలమైన సక్సెస్ లు అందుకుంటారు. వారి పని అయిపోయింది అని విమర్శలు ఎదుర్కొని, ఆ తరువాత బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు.

కెరియర్ లో డిజాస్టర్ లు అందుకొని ఈ సారి బలమైన హిట్ కొట్టాలని కసిగా వర్క్ చేస్తున్న దర్శకుల నుంచి ఈ ఏడాది సినిమాలు రాబోతున్నాయి. అవన్నీ పాన్ ఇండియా రేంజ్ ప్రాజెక్ట్ లే కావడం విశేషం. వరుసగా నాలుగు హిట్స్ అందుకొని మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య మూవీ చేసి బిగ్గెస్ట్ డిజాస్టర్ ని ఖాతాలో వేసుకున్న దర్శకుడు కొరటాల శివ. ఈ మూవీతో అతను చాలా విమర్శలు ఎదుర్కొన్నారు.

అయితే తారక్ అతని టాలెంట్ ని నమ్మి ఏడాది పాటు వెయిట్ చేసి దేవర ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించారు. 300 కోట్లకి పైగా బడ్జెట్ తో దేవర మూవీ పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతోంది. కంప్లీట్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాని కొరటాల శివ సిద్ధం చేస్తున్నారు. పబ్లిక్ లో కూడా సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. దేవరతో కచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టాలని కొరటాల కసిగా పనిచేస్తున్నారు. ఈ సినిమాను అక్టోబర్ లో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో పాన్ ఇండియా రేంజ్ లో సాహో మూవీ చేసిన యంగ్ డైరెక్టర్ సుజిత్ డిజాస్టర్ అందుకున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా నార్త్ లో ఓ మోస్తరుగా ఆడినా తెలుగులో ఫ్లాప్ అయ్యింది. అయితే ఈ సారి కచ్చితంగా పాన్ ఇండియా లెవల్ లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవాలని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓజీ మూవీ చేస్తున్నారు. రోబో 2.ఓతో డిజాస్టర్ అందుకున్న కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్. రోబో 2.ఓ తర్వాత శంకర్ సుదీర్ఘ గ్యాప్ తీసుకున్నారు.

ఈ ఏడాది కచ్చితంగా సూపర్ హిట్ అందుకోవాలని తమిళంలో ఇండియన్ 2, తెలుగులో గేమ్ చేంజర్ తో శంకర్ తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు. నానితో అంటే సుందరానికి మూవీతో ఫ్లాప్ అందుకున్న యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ. ఆ మూవీ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇంటెస్టింగ్ కథతో నానిని ఒప్పించి సరిపోదా శనివారం మూవీ చేస్తున్నారు. నాని కెరియర్ లో భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఆగస్టు 29న రానున్న ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకోవాలని కసితో వివేక్ ఆత్రేయ ఉన్నారు. మరి ఈ దర్శకులకి 2024 సంవత్సరం ఎలాంటి విజయాలు అందిస్తుందనేది చూడాలి.

Tags:    

Similar News