వచ్చే సంక్రాంతికి ఇవైతే పక్కా.. ఆ రెండు డౌటే
అయితే వీటిలో అన్నీ వస్తాయా అంటే డౌట్‌గానే ఉంది. ఎందుకంటే సాధారణంగా పండగ సీజన్లో మూడు లేదా నాలుగు సినిమాలకు మాత్రమే స్పేస్ ఉంటుంది
చిత్ర సీమకు సంక్రాంతి బాక్సాఫీస్ తిరుగులేని సీజన్. ఒకేసారి మూడు నాలుగు చిత్రాలు వచ్చినా.. బాగుంటే చాలు ఆదరించి ఆశీర్వదిస్తుంటారు ప్రేక్షకదేవుళ్లు. అలాగే ఈ పండగ బరిలో హిట్ మాట దక్కించుకుంటే చాలు కాసుల వర్షమే. అందుకే ఈ ముగ్గుల పండగ బరిలో సత్తా చాటేందుకు బడా హీరోలతో పాటు యంగ్ హీరోలు ఉవ్విళ్లూరుతుంటారు. దీనికోసం ఏడెనిమిది నెలల ముందు నుంచే తమ సినిమాలను ప్రత్యేకంగా రెడీ చేస్తుంటారు.
అలా వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్ కోసం ఇప్పటికే చాలా మంది ఫుల్ ఫోకస్ పెట్టారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు గుంటూరు కారం, రవితేజ ఈగల్, వెంకటేశ్ సైంధవ్, ప్రశాంత్ వర్మ హనుమాన్, విజయ్ దేవరకొండ వీడీ 13, రజనీకాంత్ లాల్ సలామ్(డబ్బింగ్), నాగార్జున నా సామిరంగ చిత్రాలు సంక్రాంతికి రానున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేశాయి.
అయితే వీటిలో అన్నీ వస్తాయా అంటే డౌట్‌గానే ఉంది. ఎందుకంటే సాధారణంగా పండగ సీజన్లో మూడు లేదా నాలుగు సినిమాలకు మాత్రమే స్పేస్ ఉంటుంది. ఇన్నేసి పెద్ద సినిమాలు అంటే థియేటర్స్ దొరకడం కష్టమే. ఒకవేళ అడెస్ట్ అయి వస్తే కలెక్షన్స్‌పై బాగా ప్రభావం పడుతుంది. కాబట్టి ఈ చిత్రాల్లో ఏమైనా రేసు నుంచి వెనక్కి తగ్గే అవకాశం ఉంటుంది.
సినిమాలు రిలీజ్ డేట్ మార్చుకునే ఛాన్స్‌లు చాలానే ఉన్నాయి. ఇప్పటికైతే ఈ కర్చీఫ్ వేసిన చిత్రాల్లో గుంటూరు కారం, వీడీ 13, నా సామి రంగ, సైంధవ్, లాల్ సలామ్ పక్కాగా వస్తాయని అంటున్నారు. ప్రశాంత్ హనుమాన్, రవితేజ ఈగల్ మాత్రం పోస్ట్ ప్రోన్ లేదా ప్రీ పోన్ చేసుకోవచ్చని సినీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది. వీటిపై డిసెంబర్ నెలలో క్లారిటీ వస్తుంది.
ప్రస్తుతానికి ఈ చిత్రాలు అన్నీ ఎటువంటి అప్డేట్స్ ఇవ్వకుండా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఒక హనుమాన్ మాత్రమే పూర్తైనట్టు ఉంది. ఇక డిసెంబర్ బాక్సాఫీస్ ముందుకు చాలా మార్పులు ఉంటాయని తెలిసింది. చూడాలి మరి ఏం జరుగుతుందో...