2023: ఈ కుర్ర హీరోలకు కోలుకోలేని దెబ్బ
ఈ ఏడాది టాలీవుడ్ లో నెక్స్ట్ జెనరేషన్ స్టార్స్ గా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోన్న కుర్ర హీరోలని సక్సెస్ వరించలేదు
ఈ ఏడాది టాలీవుడ్ లో నెక్స్ట్ జెనరేషన్ స్టార్స్ గా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోన్న కుర్ర హీరోలని సక్సెస్ వరించలేదు. ప్రతి సినిమాకి సక్సెస్ కోసం వారు విపరీతంగా కష్టపడుతూనే ఉన్నారు. అయితే ఆశించిన స్థాయిలో ఆడియన్స్ ని మెప్పించలేకపోతున్నారు. విభిన్నమైన కథలతో కొత్తగా ట్రై చేస్తోన్న వీరిని విజయాలు పెద్దగా వరించడం లేదు.
సంతోష్ శోభన్ మంచి టాలెంటెడ్ యాక్టర్ గా అయితే గుర్తింపు తెచ్చుకున్నాడు. కాని సక్సెస్ లు మాత్రం అందుకోలేకపోతున్నాడు. ఆయన కెరియర్ లో మెజారిటీ డిజాస్టర్ సినిమాలే కనిపిస్తున్నాయి. ఈ ఏడాది కూడా సంతోష్ శోభన్ ప్రేమ్ కుమార్, శ్రీదేవి శోభన్ బాబు, అన్ని మంచి శకునములే, కళ్యాణం కమనీయం సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ నాలుగు డిజాస్టర్ అయ్యాయి.
ఇందులో ప్రేమ్ కుమార్, శ్రీదేవి శోభన్ బాబు అయితే జీరో షేర్ మూవీస్ గా నిలిచాయి. యాక్టర్ గా ప్రూవ్ చేసుకుంటున్న కూడా హీరోగా సక్సెస్ లని సంతోష్ అందుకోలేకపోతున్నాడు. కిరణ్ అబ్బవరం కూడా ఈ ఏడాది మూడు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. వినరో భాగ్యము విష్ణు కథతో ఆరంభంలో సక్సెస్ అందుకున్నాడు. తరువాత వచ్చిన మీటర్, రీసెంట్ గా వచ్చిన రూల్స్ రంజన్ డిజాస్టర్ అయ్యాయి.
యంగ్ హీరో నాగ శౌర్య కూడా ఈ ఏడాది పలనా అబ్బాయి పలానా అమ్మాయి, రంగబలి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. మొదటి సినిమా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కింది. వీరిద్దరి కాంబోలో ఫస్ట్ డిజాస్టర్ అని చెప్పాలి. తరువాత వచ్చిన రంగబలి మూవీ ఆరంభంలో ఎవరేజ్ టాక్ వచ్చిన కమర్షియల్ సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. దీంతో డిజాస్టర్ జాబితాలో చేరిపోయింది.
ఇలా ఈ ఏడాది కుర్ర హీరోలు ముగ్గురు కూడా కెరియర్ లో ఊహించని స్థాయిలో దారుణమైన డిజాస్టర్స్ ని ఖాతాలో వేసుకున్నారు. మరి వీళ్ళ కెరియర్ 2024 ఎలా ఉండబోతోంది అనేది తెలియాల్సి ఉంది. వీరిలో అందరూ కొత్త సినిమాల షూటింగ్ లతో ప్రస్తుతం బిజీగానే ఉన్నారు.