ఆదికేశవ Vs కోట బొమ్మాలి.. ఎవరి బలమెంత?

ఈ శుక్రవారం బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలేవి లేవు. అంటే స్టార్ హీరోల సినిమాలు ఏవి రిలీజ్ కావడం లేదు

Update: 2023-11-23 10:30 GMT

ఈ శుక్రవారం బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలేవి లేవు. అంటే స్టార్ హీరోల సినిమాలు ఏవి రిలీజ్ కావడం లేదు. కాకపోతే ఓ రెండు సినిమాల మీద కాస్తో కూస్తో ఆడియన్స్ లో బజ్ ఉంది. ఆ సినిమాలే 'ఆదికేశవ', 'కోటబొమ్మాలి PS'. వీటిలో 'ఆదికేశవ' గురించి మాట్లాడుకుంటే ఇప్పటికే పాటలు, ట్రైలర్ తో ఆడియన్స్ లో హైప్ పెంచేందుకు మేకర్స్ ట్రై చేశారు. అది కొంతవరకు వర్కౌట్ అయింది.

ఆదికేశవ మీద ఆడియన్స్ లో ఉన్న హైప్ సంగతి పక్కన పెడితే ఈ మూవీ ప్రొడ్యూసర్ నాగ వంశీ కాన్ఫిడెన్స్ చూస్తే ఈసారి మాస్ కంటెంట్ గట్టిగానే ఇవ్వబోతున్నాడని అర్థమవుతుంది. కాకపోతే ట్రైలర్ చూసిన ఆడియన్స్ కి ఆ ఫీలింగ్ ఎక్కువగా కలగపోవడంతో సినిమాపై పెద్దగా బజ్ రాలేదు. హీరోయిన్ శ్రీల షూటింగ్స్ తో బిజీగా ఉండడంతో ప్రమోషన్స్ కి రాకపోవడం దీనికి ఒక మైనస్ అని చెప్పవచ్చు. ఈసారి వైష్ణవ్ తేజ్ ఉర మాస్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు.

ఇక ఈ సినిమాకి పోటీగా కంటెంట్ నమ్ముకొని ప్రేక్షకుల ముందుకు రాబోతోంది 'కోటబొమ్మాలిPS'. సీనియర్ హీరో శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, వరలక్ష్మి శరత్ కుమార్ వంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇందులో నటించారు. మలయాళం లో హిట్ అయిన 'నాయట్టు' మూవీకి కొన్ని మార్పులు చేసి జోహార్ మూవీ ఫేమ్ తేజ మర్ని ఈ సినిమాని తెరకెక్కించాడు.

ఈ మూవీ నుంచి రీసెంట్ గా రిలీజ్ అయిన 'లింగిడి లింగిడి' సాంగ్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవ్వడంతో సినిమాకి అది బాగా ప్లస్ అయింది. పోలీసుల వెంటే పోలీసులు పడడం అనే ఓ వెరైటీ పాయింట్ తో ఈ సినిమా ఉండబోతోంది. మొత్తంగా ఈ శుక్రవారం రిలీజ్ అయ్యే వాటిలో ఈ రెండు సినిమాలపైనే ఆడియన్స్ లో ఆసక్తి ఉంది. ఇవి కాకుండా 'పెర్ఫ్యూమ్', 'మాధవే మధుసూదన' వంటి చిన్న సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. అదే రోజు హాలీవుడ్ మూవీ నెపోలియన్ కూడా రిలీజ్ అవుతుంది.

కానీ మన ఆడియన్స్ కి దానిపై అంత ఆసక్తి లేదు. గతవారం విడుదలైన మంగళవారం సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్ట లేకపోవడం ట్రేడ్ పండితులను ఆశ్చర్యపరిచింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆదికేశవ, కోటబొమ్మాలిపీఎస్ సినిమాలు ఆడియన్స్ ని థియేటర్స్ లోకి రప్పించాలంటే కంటెంట్ బాగుంటే చాలు. సినిమాకి కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా మరుసటి రోజు నుంచి ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్లి మరీ ఎంజాయ్ చేయడం గ్యారెంటీ అని చెప్పొచ్చు.

Tags:    

Similar News