సంక్రాంతికి ఆ హీరోపై డౌట్ అక్కర్లే!

పండగ సీజన్ వస్తోంది అంటే చాలు సినిమాలు ఒక్కసారిగా రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంటున్నాయి.

Update: 2023-10-29 10:33 GMT

పండగ సీజన్ వస్తోంది అంటే చాలు సినిమాలు ఒక్కసారిగా రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంటున్నాయి. పోటీ ఎంత ఉన్నా కూడా కొన్ని సినిమాలు అసలు వెనక్కి తగ్గడం లేదు. మొదట కొన్ని రిలీజ్ డేట్స్ ప్రకటించినప్పటికీ ఆ తర్వాత రిస్క్ అనవసరమని మళ్లీ వెనక్కి తగ్గుతున్నాయి. ఇక సంక్రాంతి సమయంలో మాత్రం ఎంత పోటీ ఉన్న రిస్క్ చేసేందుకు మరికొన్ని సినిమాలో తెగిస్తాయి అని చెప్పాలి.

దాని వెనకాల చాలా రకాల సెంటిమెంట్స్ కూడా ఉంటాయి. సంక్రాంతిలో మినిమమ్ హిట్ కొట్టే హీరోలు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. ఇక దానికి తోడు కంటెంట్ సైడ్ నుంచి కూడా ఆలోచిస్తూ ఉంటారు. పొంగల్ లో ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా పోటీలో చాలా బలంగా కలెక్షన్స్ రాబట్టుకోవచ్చు అని నమ్ముతూ ఉంటారు. ఇక 2024 సంక్రాంతికి ఈసారి ఆసక్తికరమైన పోటీ కనిపించబోతోంది.

ఇప్పటివరకు దాదాపు ఆరు సినిమాల వరకు ఆ పండగను టార్గెట్ చేశాయి. గుంటూరు కారం, ఫ్యామిలీ స్టార్, హనుమాన్, ఈగల్, సైంధవ్, నా సామి రంగ.. వీటిలో ఏవి కూడా నుంచి వెనక్కి తగ్గడానికి ఆసక్తిని చూపించడం లేదు. తప్పకుండా థియేటర్ల విషయంలో ఎంతో కొంత ఇబ్బంది అయితే రాకుండా ఉండదు. అయినప్పటికీ సినిమాలపై నమ్మకంతో ఈసారి సంక్రాంతికి రాబోతున్నాము అని అందులో ఎలాంటి డౌట్స్ లేవు అని అన్నట్లుగా పోస్టర్లు లేదా వీడియోల ద్వారా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక గుంటూరు కారం తప్పకుండా అప్పుడే వస్తుంది అని నిర్మాత నాగ వంశీ చెబుతున్నాడు. ఇక హనుమాన్ కు సంబంధించిన పోస్టర్లు కూడా సంక్రాంతి విడుదల అంటూ హడావిడి చేస్తున్నాయి. ఫ్యామిలీ స్టార్, ఈగల్ కు సంబంధించిన అప్డేట్స్ కూడా సంక్రాంతి అని గట్టిగానే చెబుతున్నాయి. సైంధవ్ విషయంలో కూడా డౌట్స్ అయితే కనిపించడం లేదు.

కానీ నాగార్జున నా సామి రంగా సినిమా మాత్రం ఇప్పటి వరకు ఒకే ఒక్కసారి సంక్రాంతి అంటూ అప్డేట్ ఇచ్చింది. మళ్ళీ సంక్రాంతికి సినిమా ఉంటుందా ఉండదా అనే గాసిప్స్ మాత్రం కొన్ని వైరల్ అవుతున్నాయి. అయితే ఈ పోటీలో ఎవరు తగ్గినా కూడా నాగార్జున మాత్రం వెనుకడుగు వేసే అవకాశం అయితే ఉండదు. ఎందుకంటే గతంలో నాగార్జున సినిమాలు సంక్రాంతికి వచ్చి బిగ్ సక్సెస్ చూశాయి.

సోగ్గాడే చిన్నినాయన, బంగార్రాజు రెండు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకున్నాయి. దీంతో ఆ సెంటిమెంట్ తోనే నాగార్జున ఈసారి నా సామి రంగ సినిమాను సంక్రాంతి బరిలో దించబోతున్నాడు. దానికి తోడు కంటెంట్ కూడా పూర్తి స్థాయిలో మాస్ కమర్షియల్ గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. డిసెంబర్లో ఈ సినిమా వచ్చే అవకాశం ఉందని కొన్ని గాసిప్స్ వైరల్ అయ్యాయి. కానీ అందులో కూడా నిజం లేదని తెలుస్తోంది.

Tags:    

Similar News