టాలీవుడ్.. డిసెంబర్ లో సాలీడ్ బిజినెస్
అలాగే సందీప్ రెడ్డి వంగా యానిమల్ కూడా తెలుగు నాట భారీ ఎక్స్ పెక్టేషన్స్ తోనే రిలీజ్ అవుతోంది.
డిసెంబర్ నెల సినిమా ఇండస్ట్రీలో చాలా కాస్ట్లీగా ఈ ఏడాది ఉండబోతోంది. సాలిడ్ మూవీస్ అన్ని కూడా ఈ నెలలోనే వస్తున్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సలార్. డార్లింగ్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమా భారీ అంచనాల నడుమ డిసెంబర్ 22న రిలీజ్ కి రెడీ అవుతోంది. అలాగే సందీప్ రెడ్డి వంగా యానిమల్ కూడా తెలుగు నాట భారీ ఎక్స్ పెక్టేషన్స్ తోనే రిలీజ్ అవుతోంది.
ఈ రెండు కాకుండా షారుఖ్ ఖాన్ డుంకీ మూవీ సలార్ కి ఒక రోజు ముందుగా డిసెంబర్ 21న రిలీజ్ అవుతోంది. దీనికి కూడా మంచి రెస్పాన్స్ రావొచ్చు. వీటితో పాటు టైర్ 2 హీరోలైన నాని నుంచి హాయ్ నాన్న మూవీ డిసెంబర్, అలాగే నితిన్ ఎక్స్ట్రార్దినరీ సెకండ్ వీక్ లో రిలీజ్ కాబోతున్నాయి. అలాగే చిన్న సినిమాలైన అథర్వ, కాలింగ్ సహస్ర, పిండం, జోరుగా హుషారుగా సినిమాలు కూడా థియేటర్స్ లోకి రాబోతున్నాయి.
టైర్ 2 హీరోల నుంచి వస్తోన్న హాయ్ నాన్న, ఎక్స్ట్రార్డినరీ సినిమాలు థీయాట్రికల్ బిజినెస్ విలువ 80 కోట్ల వరకు ఉంది. వీటిలో హాయ్ నాన్న పాన్ ఇండియా రేంజ్ లో ఐదు భాషలలో రిలీజ్ అవుతోంది. యానిమల్ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ విలువ రూ.16 కోట్లు. ఈ మూడు చిత్రాలు కలిపిది 96 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. చిన్న సినిమాలు అన్ని ఒక 4 కోట్ల బిజినెస్ వేసుకుంటే మొత్తం 100 కోట్ల వ్యాపారం జరిగినట్లు అవుతుంది.
ప్రభాస్ సలార్ మూవీ తెలుగు రాష్ట్రాలలో 170 కోట్ల బిజినెస్ చేసింది. దీంతో కలుపుకొని మొత్తం వేల్యూ 270 కోట్లుగా ఉంది. ఈ మధ్యకాలంలో ఈ స్థాయిలో సినిమా వ్యాపారం తెలుగు రాష్ట్రాలలో జరగలేదు. ఈ లెక్కలు చూసుకుంటే సంక్రాంతి కంటే ముందుగానే ఈ ఏడాది ఆఖరు టాలీవుడ్ లో భారీ కలెక్షన్స్ తెచ్చిపెడతాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
యానిమల్ నుంచి సలార్ వరకు రిలీజ్ అవుతోన్న సినిమాలలో మెజారిటీ మూవీస్ భారీ అంచనాల మధ్యన థియేటర్స్ లోకి వస్తున్నావే కావడం విశేషం. ఇవన్ని హిట్ అయితే కచ్చితంగా 1000 నుంచి 1500 కోట్ల వరకు డిసెంబర్ లో తెలుగు సినిమాల కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.