హాలీవుడ్‌లో సత్తా చాటిన టాప్ 10 స్టార్లు
దేశం కాని దేశంలో సత్తా చాటుతున్న మేటి భారతీయ ప్రతిభావంతుల గురించి చర్చిస్తే ఇలా ఉంది మ్యాటర్.
భారతీయ నటీమణులు ప్రపంచ సినీవేదికపై గొప్ప గుర్తింపు గౌరవం కలిగి ఉన్నారు. తమదైన అందం ప్రతిభతో ఆకట్టుకున్న వారి జాబితాలో ప్రియాంక చోప్రా, ఐశ్వర్యారాయ్, టబు, దీపిక పదుకొనే వంటి నాయికలు ఉన్నారు. దేశం కాని దేశంలో సత్తా చాటుతున్న మేటి భారతీయ ప్రతిభావంతుల గురించి చర్చిస్తే ఇలా ఉంది మ్యాటర్.
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ 2024లో `కిల్- ఎమ్ ఆల్ 2`తో హాలీవుడ్ సీన్‌లోకి ప్రవేశించింది. అక్కడ ఆమె లెజెండరీ జీన్-క్లాడ్ వాన్ డామ్‌తో స్క్రీన్‌ను షేర్ చేసుకుంది. ఎప్పటిలాగే అద్భుతంగా కనిపిస్తూ, ఆకట్టుకునే బైక్ స్టంట్ లు సహా థ్రిల్లింగ్ సన్నివేశాలతో తన యాక్షన్ విన్యాసాలను ప్రదర్శించింది. ఐశ్వర్య రాయ్ బచ్చన్ 2009లో స్టీవ్ మార్టిన్ సరసన `ది పింక్ పాంథర్ 2`తో హాలీవుడ్ రంగ ప్రవేశం చేసింది. ఆమె ఆన్-స్క్రీన్ ప్రెజెన్స్ మంత్రముగ్ధులను చేసింది. ఐష్ తనదైన అందం ప్రతిభతో అంతర్జాతీయంగా వేవ్స్ క్రియేట్ చేసింది. ప్రియాంక చోప్రా 2017లో బేవాచ్‌లో తన పాత్రతో హాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. డ్వేన్ జాన్సన్‌తో స్క్రీన్‌ను షేర్ చేసుకున్న ప్రియాంక చోప్రా షో స్టాపర్ గా నిలిచింది. మ్యాట్రిక్స్ 4 లోను నటించింది. తనదైన ఆకర్షణ నటప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల హృదయాలను గెలుచుకుంది. ఆ తర్వాత పీసీ సిటాడెల్ సహా పలు వెబ్ సిరీస్ లలో నటించింది. ప్రస్తుతం సిటాడెల్ సీజన్ 2 చిత్రీకరణ సాగుతోంది. క్వాంటికో వెబ్ సిరీస్ చిత్రీకరణ సమయంలోనే నిక్ జోనాస్ తో ప్రేమలో పడిన సంగతి తెలిసిందే.
2017లో విన్ డీజిల్‌తో కలిసి నటించిన xXx: రిలన్ ఆఫ్ జేవియర్ కేజ్‌తో దీపికా పదుకొణె హాలీవుడ్ లో తనదైన ముద్ర వేసింది. దీపిక అందం ఆకర్షణకు హాలీవుడ్ మంత్ర ముగ్ధమైంది. హై ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాల్లో దీపిక సత్తా చాటింది. తన నటనకు గొప్ప ప్రశంసలు పొందింది. అలియా భట్ 2023లో హార్ట్ ఆఫ్ స్టోన్‌తో హాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది, గాల్ గాడోట్ -జామీ డోర్నన్‌లతో స్క్రీన్‌ను పంచుకుంది. తన సహనటుల నుండి విపరీతమైన ప్రేమను పొందడమే కాకుండా సినిమాలో తన అద్భుత నటనతో ప్రేక్షకుల హృదయాలను కూడా గెలుచుకుంది.
దేశీ నటులు చాలామంది ఉన్నరు:
అంతగా తెలుగు వారిలో పాపులర్ కాని దేశీ నటులు హాలీవుడ్ లో ఉన్నారు. భారతీయ సంతతికి చెందిన నటుల జాబితాలో ది జంగిల్ బుక్ లో మోగ్లీకి ప్రధాన పాత్ర పోషించిన నీల్ సేథి పేరు మార్మోగింది. డెడ్ పూల్ నుండి ఇండియన్ క్యాబీ డోపిందర్ గానూ అతడు కనిపించారు. న్యూయార్క్ నుండి వచ్చిన భారతీయ మూలాలున్న నటుడు నీల్ సేథి. ది జంగిల్ బుక్ నటుడిగా సుపరిచితం. బిల్ ముర్రే- బెన్ కింగ్స్లీ- ఇడ్రిస్ ఎల్బా- లుపిటా న్యోంగో- స్కార్లెట్ జోహన్సన్ -క్రిస్టోఫర్ వాల్కెన్ స్వరాలు అందించిన జంగిల్ బుక్ చిత్రంలో నీల్.. మోగ్లీ పాత్రలో నటించారు. ఈ పదేళ్ల వయస్సు పాత్ర కోసం ఆడిషన్ చేసిన వేలాది మంది పిల్లల నుండి అతడిని ఫైనల్ చేశారు. ప్రస్తుతం అతడు పశ్చిమంలో తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నాడు. డెడ్ పూల్ లో భారతీయ సంతతికి చెందిన టాక్సీ డ్రైవర్ కరణ్ సోని అకా డోపిందర్ పాత్ర ఆసక్తిని కలిగిస్తుంది. హిట్ టీవీ సిరీస్ `హీరోస్` లో జన్యు శాస్త్రవేత్త మొహిందర్ సురేష్ పాత్రకు అంతర్జాతీయ టెలివిజన్ లో బాగా ప్రాచుర్యం పొందిన ముఖాల్లో సెంధిల్ రామమూర్తి ఒకరు. యుఎస్ లో పుట్టి పెరిగిన పొడగరి అందగాడు సెంధిల్ కన్నడిగ .. కోవర్ట్ ఎఫైర్స్ అనే మరో టీవీ సిరీస్ లో విల్ కాక్స్ పాత్ర పోషించినందుకు ఆయన చాలా పాపులరయ్యారు.
దేవ్ పటేల్- ఫ్రీదా పింటో జంట స్లమ్‌డాగ్ మిలియనీర్ తో పాపులరయ్యారు. ఉత్తమ చిత్రంగా ఆస్కార్ అవార్డును గెలుచుకుంది ఈ చిత్రం. నటీనటులు హాలీవుడ్ లో పెద్ద పేరు తెచ్చుకున్నారు. ప్రిదా ఆ తర్వాత అనేక చిత్రాలలో నటించింది. `రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్`లోనూ కథానాయిక. వివిధ అంతర్జాతీయ అవార్డులు ఈవెంట్లలో ఆమె అద్భుతమైన రెడ్ కార్పెట్ ప్రదర్శనల కారణంగా బాగా వెలుగులోకి వచ్చింది. దేవ్ పటేల్ ఇటీవలే ది మంకీ మ్యాన్ చిత్రంతో నటుడిగా సత్తా చాటాడు. అతడితో పాటు ఈ చిత్రంలో తెలుగమ్మాయి శోభిత ధూళిపాల ప్రభావవంతమైన నటనతో ఆకట్టుకుంది.
దిల్లీ విశ్వవిద్యాలయంలోని సెయింట్ స్టీఫెన్స్ నుండి గ్రాడ్యుయేట్ అయిన సూరజ్ శర్మ ఆస్కార్ చిత్రం `లైఫ్ ఆఫ్ పై`లో ప్రధాన పాత్ర పోషించాడు. ఇర్ఫాన్ ఖాన్ - టబులు తన తల్లిదండ్రులుగా కనిపించారు. ఈ చిత్రం నాలుగు అకాడమీ అవార్డులను పొందగా ఈ దిల్లీ కుర్రవాడు బాఫ్టా రైజింగ్ స్టార్ అవార్డుకు ఎంపికయ్యాడు. దర్శకుడు ఆంగ్ లీ అమాయకంగా కనిపించే పైని సూరజ్ లో చూశాడు. యువ భారతీయుడు రింకు సింగ్ హాలీవుడ్ లో `మిలియన్ డాలర్ ఆర్మ్` తో పాపులరయ్యాడు. ఇది మాత్రమే కాదు.. అతను ప్రముఖ టీవీ సిరీస్ హోంల్యాండ్ లో అయాన్ ఇబ్రహీం పాత్ర పోషించాడు. అతను ఏదో ఒక రోజు హాలీవుడ్ టాప్ నటుడిగా ఎదిగినా ఆశ్చర్యపోనవసరం లేదు.
నెవర్ హ్యావ్ ఐ ఎవర్ లో మైత్రేయి రామకృష్ణన్ నటించారు. నెట్ ఫ్లిక్స్ ఫిల్మ్ `ద నెదర్ ఫీల్డ్ గాళ్స్ లోనూ అవకాశం దక్కించుకున్నారు. అమెరికన్ యాక్షన్ కామెడీ థ్రిల్లర్ `రెడ్ నోటీస్`లో నటించిన రీతూఆర్య కూడా ఇండియన్ నటి. బ్రిటీష్ టీవీ సిరీస్ `డాక్టర్స్`తో ఆమె పాపులర్. `హ్యూమన్స్` ఆమెకు మరింత గుర్తింపు తెచ్చింది. ద అంబరిల్లా అకాడెమీ రెండో సీజన్ రీతూఆర్యకు ఎంతో పేరు తెచ్చింది.
జెరాల్డీన్ విశ్వనాథన్ `బ్యాడ్ ఎడ్యుకేషన్`లో జర్నలిస్టుగా నటించారు. తనకు `బ్లాకర్స్` తొలి గుర్తింపు తీసుకొచ్చింది. పీసీ నిర్మించిన `ఈవిల్ ఐ`లో సునీతా మణి భారతీయ మూలాలు ఉన్న నటే. అందులో నటించిన సరితా చౌదరి భారతీయురాలు. మిస్టర్ రోబోట్ - కామెడీ వెబ్ సిరీస్ ‘గ్లో’ సునీత కు పేరు తెచ్చాయి. మీరా- రాయల్ డిటెక్టివ్ టీవీ సిరీస్ లో నటిస్తున్నారు. అమెరికన్ టీవీ సిరీస్ `గ్రాండ్ ఆర్మీ`లో నటించిన ఆష్లీ గేంగర్... బ్రిటీష్ టీవీ సిరీస్ `వండర్ లిస్ట్ `తో నటిగా ప్రయాణం ప్రారంభించిన అన్యా ఛలోట్రా భారతీయురాలు. ఇర్ఫాన్‌ఖాన్- ఓం పురి కూడా హాలీవుడ్ లో నటించారు.