దేవర ఈవెంట్.. అగ్ర దర్శకులతో హై వోల్టేజ్ కిక్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ ప్రీరిలీజ్ వేడుకకి రంగం సిద్ధం అయ్యింది.

Update: 2024-09-20 03:43 GMT

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ ప్రీరిలీజ్ వేడుకకి రంగం సిద్ధం అయ్యింది. ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ లో తారక్ చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. అన్ని రాష్ట్రాలు తిరుగుతూ అక్కడి ప్రజలకి ‘దేవర’ సినిమాని చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సినిమాపై రోజు రోజుకి హైప్ మరింత పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. ‘దేవర’ మూవీలో ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలనే క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుక సెప్టెంబర్ 22న జరగబోతోంది. అయితే ఈ సారి ‘దేవర’ ప్రీరిలీజ్ ఈవెంట్ ఓపెన్ స్టేడియంలో నిర్వహించడం లేదు. పబ్లిక్ తక్కువగా అటెండ్ అయ్యే అవకాశం ఉంటుందనే మాట వినిపిస్తోంది. ‘దేవర’ ప్రీరిలీజ్ ఈవెంట్ ద్వారా సినిమాకి నెక్స్ట్ లెవల్ హైప్ తీసుకురావాలని అనుకుంటున్నారు. దానికోసం ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఇండస్ట్రీకి చెందిన చాలా మంది స్టార్స్ పాల్గొనే అవకాశం ఉందని అంటున్నారు.

ముఖ్యంగా ఈ ఈవెంట్ కి రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, ప్రశాంత్ నీల్ అతిథులుగా హాజరు కాబోతున్నారు. ఇండియాలో మొత్తం షేక్ చేసే ఇద్దరు దర్శకులు చాలా కాలం తర్వాత ‘దేవర’ ఈవెంట్ లో ఒకే వేదిక మీదికి రాబోతున్నారనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా నెక్స్ట్ పాన్ ఇండియా దర్శకుల జాబితాలో చేరబోతున్నాడు. అందుకు తగ్గ ప్రాజెక్ట్ ని ఇప్పటికే రెడీ చేస్తున్నాడని తెలుస్తోంది.

కొరటాల శివతో కలిపి నాలుగు స్టార్ దర్శకులు స్టేజ్ పై కనిపించి ఎన్టీఆర్ గురించి మాట్లాడితే ఆ కిక్కే వేరుగా ఉంటుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. డైరెక్ట్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ కి ఫ్యాన్స్ ఎక్కువగా అటెండ్ అయ్యే అవకాశం లేకపోయిన ఛానల్స్ లలో లైవ్ చూడొచ్చు. ఈ లైవ్ షోలకి ఫ్యాన్స్ అతుక్కుపోయే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అలాగే ‘దేవర’ ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఏ స్టార్ యాక్టర్స్ అటెండ్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది.

ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ లోనే ‘దేవర’ సెకండ్ ట్రైలర్ ని రిలీజ్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ సెకండ్ ట్రైలర్ తో మూవీపై అంచనాలు మరింత పెరిగే ఛాన్స్ ఉంటుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. మూవీపై ఉన్న హైప్ తో ‘దేవర’ మొదటి రోజు 100-150 కోట్ల మధ్యలో గ్రాస్ కలెక్షన్స్ ని వసూళ్లు చేసే ఛాన్స్ ఉంటుందని ట్రేడ్ పండితులు ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. మరి దేవర ఆ రేంజ్ లో రికార్డ్ అందుకుంటుందో లేదో చూడాలి.

Tags:    

Similar News