హైదరాబాద్ మల్టీప్లెక్స్.. టాప్ కలెక్షన్స్ సినిమాలివే
మల్టీప్లెక్స్ థియేటర్స్ లో టికెట్ ధరలు ఎక్కువగా ఉంటాయి. అయిన మంచి సినిమాని మంచి ఎక్స్ పీరియన్స్ లో ఆశ్వాదించడానికి చాలా మంది మల్టీప్లెక్స్ లకి వెళ్తున్నారు.
తెలుగు సినిమా మార్కెట్ రోజు రోజుకి పెరుగుతోంది. మన సినిమాలు ఇండియన్ వైజ్ గా ఆదరణ సొంతం చేసుకుంటున్నాయి. మల్టీప్లెక్స్ లలో కూడా తెలుగు సినిమాలు రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ కొల్లగొడుతున్నాయి. మల్టీప్లెక్స్ థియేటర్స్ లో టికెట్ ధరలు ఎక్కువగా ఉంటాయి. అయిన మంచి సినిమాని మంచి ఎక్స్ పీరియన్స్ లో ఆశ్వాదించడానికి చాలా మంది మల్టీప్లెక్స్ లకి వెళ్తున్నారు.
ఈ కారణంగా సినిమాకి హిట్ టాక్ వచ్చింది అంటే మల్టీప్లెక్స్ స్క్రీన్స్ కూడా హౌస్ ఫుల్ పడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో నేషనల్ మల్టీప్లెక్స్ స్క్రీన్స్ లో రికార్డ్ స్థాయిలో వసూళ్లు సాధించిన సినిమాల జాబితా చూసుకుంటే మొదటిస్థానంలో రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీ ఉంది. ఈ సినిమా ఏకంగా 28.12 కోట్లు నెట్ వసూళ్లు చేసింది.
దీని తర్వాత స్థానంలో స్టార్ హీరోల చిత్రాలని దాటుకొని అనూహ్యంగా హనుమాన్ చిత్రం నిలవడం విశేషం. దీనిని బట్టి ఈ సినిమాకి ఎలాంటి ఆదరణ లభించిందో అర్ధం చేసుకోవచ్చు. మూవీ ఓవరాల్ గా 18.4 కోట్ల నెట్ కలెక్ట్ చేసి రికార్డ్ సృష్టించింది. హనుమాన్ తర్వాత స్థానంలో ప్రభాస్ సలార్ మూవీ నిలవడం గమనార్హం. ఈ సినిమా 18. 39 కోట్లు వసూళ్లు సాధించింది.
తరువాత వరుసగా ఉన్న సినిమాలు చూసుకుంటే రాకింగ్ స్టార్ యాష్ కేజీఎఫ్ చాప్టర్ 2 రెండు భాషలలో అన్ని భాషలలో కలిపి 15.7 కోట్లు నెట్ కలెక్ట్ చేసింది. నెక్స్ట్ ఆదిపురుష్ 11.75 కోట్ల కలెక్షన్స్ సాధించింది. నాని దసరా కూడా రికార్డ్ స్థాయిలో 10.95 కోట్లు వసూళ్లని సొంతం చేసుకుంది. టాప్ 6 లో ఉన్న సినిమాలు అన్ని కూడా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయినవే.
ఇవి తెలుగుతో పాటు హిందీ భాషలో కూడా నేషనల్ మల్టీప్లెక్స్ థియేటర్స్ లో ప్రదర్శించబడ్డాయి. వీటి తర్వాత మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య 10.74 కోట్లతో ఏడో స్థానంలో ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప తెలుగు రాష్ట్రాలలో తక్కువ ప్రభావం చూపించింది. ఈ మూవీ 10.35 కోట్ల నెట్ మాత్రమే సాధించింది. నెక్స్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారువారిపాట మూవీ 10.59 కోట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచింది. సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ మూవీ కూడా ఏకంగా 9.19 కోట్లు నేషనల్ మల్టీప్లెక్స్ స్క్రీన్స్ లో వసూళ్లు చేసింది.
ఆర్ఆర్ఆర్ - ₹28.12 CR
హనుమాన్ - ₹18.4 CR
సలార్ - ₹18.39 CR
కేజీఎఫ్ చాప్టర్ 2 - ₹15.7 CR
ఆదిపురుష్ - ₹11.75 CR
దసరా - ₹10.95 CR
వాల్తేరు వీరయ్య - ₹10.74 CR
పుష్ప - ₹10.35 CR
సర్కారువారిపాట - ₹10.59 CR
జైలర్ - ₹9.19 CR