బాబోయ్.. తెలుగు లో సినిమా నా వల్ల కాదు!
టాలీవుడ్ లో స్టార్ హీరోలు మాత్రమే కాకుండా చిన్న హీరోలూ ఏడాదికి ఒకటి చొప్పున సినిమాలు చేస్తున్నారు.
టాలీవుడ్ లో స్టార్ హీరోలు మాత్రమే కాకుండా చిన్న హీరోలూ ఏడాదికి ఒకటి చొప్పున సినిమాలు చేస్తున్నారు. చాలా తక్కువ మంది మాత్రమే ఏడాదికి ఒకటి మించి సినిమాలతో వస్తున్నారు. కానీ ఇతర భాషల్లో ముఖ్యంగా మలయాళ సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరోలు, సీనియర్ హీరోలు, స్టార్ హీరోలు ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి స్టార్స్ ఏడాదికి అటు ఇటుగా పది సినిమాలూ చేస్తున్న దాఖలాలు ఉన్నాయి. మలయాళ యంగ్ హీరో టోవినో థామస్ ఏడాదిలో లెక్కకు మించి సినిమాలు చేస్తూ ఉంటాడు.
తాజాగా టోవినో థామస్ నటించిన 'ఏఆర్‌ఎం' సినిమా విడుదలకు సిద్ధం అయింది. సెప్టెంబర్ 12న విడుదల కాబోతున్న ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకూ తీసుకు రాబోతున్నారు. ఉప్పెన ముద్దుగుమ్మ కృతిశెట్టి హీరోయిన్ గా నటించిన 'ఏఆర్‌ఎం' సినిమా ప్రీ రిలీజ్ వేడుక తాజాగా జరిగింది. తెలుగు లో ఏఆర్‌ఎంను ప్రమోట్ చేయడం కోసం టోవినో థామస్ హైదరాబాద్ కి వచ్చాడు. ఆ సమయంలో మీడియాతో మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తెలుగు లో సినిమా ను చేయను అంటూ డైరెక్ట్ గా చెప్పేశాడు.
టోవినో థామస్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... తెలుగు లో సినిమా చేసే ఉద్దేశ్యం లేదని చెప్పుకొచ్చాడు. తెలుగు హీరోలతో మల్టీ స్టారర్ సినిమా చేసే అవకాశం భవిష్యత్తులో వస్తే చేస్తారా అంటూ ప్రశ్నించిన సమయంలో ఆయన పై విధంగా స్పందించాడు. తెలుగు లో ఒక సినిమాను నేను కమిట్ అయితే మలయాళంలో నేను కమిట్ అయిన నాలుగు అయిదు సినిమాలపై ప్రభావం పడుతుంది. ఎక్కువ సమయం తెలుగు సినిమాల కోసం కేటాయించాల్సి ఉంటుంది. అలాగే మరో హీరోతో కలిసి నటించేప్పుడు కచ్చితంగా డేట్స్ విషయంలో ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది.
కనుక ఇప్పట్లో తెలుగు లో నేను డైరెక్ట్ సినిమాను చేయను అంటూ టోవినో నిర్మొహమాటంగా చెప్పేశాడు. మలయాళంకు చెందిన ఫహద్ ఫాసిల్ తో పాటు మరికొందరు స్టార్స్ టాలీవుడ్ లో సినిమాలు చేస్తున్నారు. వారు ఒక్కో సినిమాకు చాలా సమయం కేటాయించాల్సి వస్తుంది. ఆ విషయాన్ని గురించడం వల్లే టోవినో థామస్ తెలుగు లో తాను సినిమాలు చేసేందుకు ఆసక్తిగా లేను అంటూ చెప్పేశాడు. అక్కడ హీరోగా ఆఫర్లు తగ్గినప్పుడు టాలీవుడ్ వైపు ఏమైనా చూస్తాడా అనేది చూడాలి. తెలుగు లో పలు డబ్బింగ్ సినిమాలతో టోవినో థామస్ కి గుర్తింపు దక్కింది. అందుకే ఇప్పుడు ఏఆర్‌ఎం సినిమాను తెలుగు లో డబ్ చేసి భారీ ఎత్తున ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.