స్టార్ హీరో 50వ సినిమాపై పైరసీ భూతం!
కొత్త సినిమాలు థియేటర్లో రిలీజ్ అవ్వడం పాపం..వెంటనే అవి వెబ్ సైట్లలో ప్రత్యక్షమవుతున్నాయి.
పైరసీ భూతాన్ని అంతం చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా? ఏదో మూల పైరసీ జరుగుతూనే ఉంది. కొత్త సినిమాలు థియేటర్లో రిలీజ్ అవ్వడం పాపం..వెంటనే అవి వెబ్ సైట్లలో ప్రత్యక్షమవుతున్నాయి. ఇటీవలే టోవినో థమాస్ నటించిన మలయాళం చిత్రం 'ఏఆర్ ఎమ్' ని మైత్రీమూవీ మేకర్స్ రిలీజ్ చేసింది. తాజాగా ఈసినిమా పైరసీకి గురైంది. ఈ కేసులో ఇద్దర్ని పోలీసులు అరెస్ట్ చేసారు. కోయంబత్తూరులో నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు.
కొచ్చి సైబర్ పోలీసులు వాళ్లిద్దర్నీ విచారిస్తున్నారు. ఓనం సందర్భంగా సెప్టెంబర్ 12న ఈ చిత్రం రిలీజ్ అయింది. ఇంకా ఓటీటీలో కూడా రిలీజ్ అవ్వలేదు. ఇంతలోనే సినిమా థియేటర్లోనే పైరసీకి గురైనట్లు తెలుస్తోంది. రైలులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు సినిమా ఫోన్ లో చూసాడు. దానికి సంబంధించిన వీడియని దర్శకుడు జితిన్ లాలా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసాడు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఏఆర్ ఎమ్ ఇటీవల థియేటర్లో రిలీజ్ అయిన అతి పెద్ద మలయాళం చిత్రం. ఇది టోవినో థామస్ కి 50వ చిత్రం. ఇందులో అజయన్, మణియన్,కుంజికేలు అనే మూడు విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. ఈమద్య కాలంలో టోవినో థామస్ సినిమాలు మంచి విజయం సాధిస్తున్నాయి. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తున్నాయి.
దీంతో సౌత్లో బాగా ఫేమస్ అయిన నటుడిగా మారారు. ఇతర భాషల్లోనూ గుర్తింపు రావడంతో అక్కడ కూడా నటుడిగా అవకాశాలు వస్తున్నాయి. కానీ తాను సొంత పరిశ్రమలోఇంకా చాలా సినిమాలు చేయాలని...వాటిని పూర్తి చేసిన తర్వాతే ఇతర భాషల్లో సినిమాలు చేస్తానని అంటున్నాడు. తాజాగా సినిమా పైరసీకి గురవ్వడంతో నిరుత్సాహం వ్యక్తం చేసాడు.