ట్యాలెంటెడ్ నటి మంచో చెడో డిసైడైందా?
కెరీర్ ప్రారంభంలో నటించేందుకు ఆస్కారం ఉన్న పాత్రలతో మెప్పించింది ట్రిప్తీ దిమ్రీ. కానీ అవేవీ తనకు అంతగా కలిసి రాలేదు.
కెరీర్ ప్రారంభంలో నటించేందుకు ఆస్కారం ఉన్న పాత్రలతో మెప్పించింది ట్రిప్తీ దిమ్రీ. కానీ అవేవీ తనకు అంతగా కలిసి రాలేదు. రణబీర్ కపూర్ లాంటి పెద్ద స్టార్ సరసన `యానిమల్`లో కనిపించాకే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అతడితో ఘాటైన రొమాన్స్ ని పండించిన ఈ బ్యూటీకి అనూహ్యంగా కొత్త ఇమేజ్ వచ్చి పడింది. అయితే దీంతో మేలు కంటే ఇప్పుడు చిక్కులే ఎక్కువయ్యాయి.
ఇటీవలి కాలంలో ఈ భామకు యానిమల్ లో పాత్ర తరహాలో బోల్డ్ గా నటీగా ఉండే పాత్రల్లో నటించే అవకాశాలే వస్తున్నాయి. బ్యాడ్ న్యూజ్ ఇదే కేటగిరీకి చెందుతుంది. కానీ యానిమల్, బ్యాడ్ న్యూజ్ ఇప్పటికే తనకు మంచి పేరునే తెచ్చాయి కానీ బ్యాడ్ నేమ్ తేలేదు. వీటివల్ల తన ఇమేజ్ పెరిగింది.. అవకాశాలు పెరిగాయి.. పారితోషికం అమాంతం పెరిగింది. కానీ ఎన్ని ఉన్నా తనకు పరిపూర్ణమైన నటిగా మంచి పేరొచ్చేది ఎప్పుడు? కెరీర్ ఆరంభం చేసినట్టు నటనకు ఆస్కారం ఉన్న.. వందశాతం నిరూపించుకునే స్క్రిప్టుల్లో నటించే అవకాశం మళ్లీ వస్తుందా? అన్నదే సందిగ్ధంగా ఉంది.
లైలా మజ్ను - బుల్బుల్ చిత్రాలతో పాటు, క్వాలా అనే వెబ్ సిరీస్‌లో కూడా కనిపించిన ట్రిప్తీ నటిగా సంతృప్తికరమైన ప్రదర్శన ఇచ్చింది. ఆ సినిమాల్లో ట్రిప్తీ అందరికీ నచ్చింది. కానీ ఆ తర్వాత యానిమల్, బ్యాడ్ న్యూజ్ లాంటి అవకాశాలొచ్చాయి. ఇటీవల తనకు వచ్చే అవకాశాలన్నీ ఇదే తరహా. బోల్డ్ గా నటించాలి అనే ప్రపోజల్స్ వస్తున్నాయి. ఇప్పటి ఈ పరిస్థితికి ట్రిప్తి చింతించాలా? ఆనందించాలా? అన్నది అర్థం కాని గందరగోళ పరిస్థితి. అయితే ప్రతి మలుపులో అవకాశాలతో పాటు, అదృష్టం కలిసి రావాలి. ఇప్పుడు ఈ భామకు `విక్కీ విద్యా కా వో వాలా` వీడియో నుండి `మేరే మెహబూబ్` మ్యూజిక్ వీడియో మంచి పేరే తెస్తోంది. త్రిప్తిపై చాలా విమర్శలు వెల్లువెత్తినా కానీ, ఈ మ్యూజిక్ వీడియో 2 రోజుల్లో 15 మిలియన్ల వీక్షణలను దాటింది. కానీ ట్రిప్తీ డ్యాన్స్ మూవ్స్ పై తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ భామ రాజ్ కుమార్ రావుతో ప్రయోగాత్మక చిత్రంలో నటించింది. అలాగే వరుసగా సీక్వెల్ సినిమాలతోను అదరగొట్టబోతోంది.