గాజులు కాదు గవ్వలు.. ట్రిప్తీ స్టన్నింగ్ ఎలివేషన్
యానిమల్ చిత్రంలో అద్భుత నటనతో యువ హృదయాలను దోచుకుంది ట్రిప్తి దిమ్రీ.
యానిమల్ చిత్రంలో అద్భుత నటనతో యువ హృదయాలను దోచుకుంది ట్రిప్తి దిమ్రీ. సందీప్ వంగా ఈ అమ్మడిని తెరపై చూపించిన విధానం ఒక కిక్కు. ఒకే ఒక్క బ్లాక్ బస్టర్ తో ట్రిప్తీ ఫేట్ అమాంతం మారిపోయింది. ఒక్కో ప్రాజెక్ట్ కోసం కోట్లాది రూపాయల పారితోషికాన్ని ఈ బ్యూటీ అందుకుంటోంది. ఇప్పటికిప్పుడు ఆషిఖి 3 , ధడక్ 2 సహా పలు సీక్వెల్ చిత్రాల్లో నటిస్తోంది.
మరోవైపు స్టార్ హీరోల సినిమాల్లోను ఐటమ్ నంబర్లకు సంతకాలు చేస్తోంది. సామాజిక మాధ్యమాల్లో ప్రకటనల ద్వారాను ట్రిప్తీ బాగానే ఆర్జిస్తోంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోషూట్లను షేర్ చేస్తూ యూత్ కి నిరంతర ట్రీట్ ని అందిస్తోంది. ట్రిప్తీ తాజా ఫోటోషూట్ ఇప్పుడు ఇంటర్నెట్ లో గుబులు రేపుతోంది. అందమైన డిజైనర్ పరికిణీ.. దానికి కాంబినేషన్ గా క్రీమ్ కలర్ బ్లౌజ్ లో ట్రిప్తీ రియల్ స్టన్నర్ గా కనిపిస్తోంది. ముఖ్యంగా ట్రిప్తీ జడలు హెయిర్ కట్.. దానికి కాంబినేషన్‌గా చేతులకు బరువైన డిజైనర్ గాజులు, కంకణాలతో తన లుక్ ని మరింతగా ఎలివేట్ చేసాయి. ప్రస్తుతం ఈ స్పెషల్ ఫోటోగ్రాఫ్ అంతర్జాలంలో వైరల్ గా మారుతోంది. ట్రిప్తీ స్టన్నింగ్ లుక్ కి యువతరం ఫిదా అయిపోతోంది. బ్యూటిఫుల్.. లవ్ లీ అంటూ హార్ట్ ఈమోజీలను అభిమానులు షేర్ చేస్తున్నారు.
ట్రిప్తీ నటించిన పలు చిత్రాలు విడుదల కావాల్సి ఉంది. తన సహనటుడు రాజ్‌కుమార్ రావుతో కలిసి విక్కీ ఔర్ విద్యా కా వో వాలా వీడియోను ప్రచారం చేయడంలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం 90ల నాటి కొత్తగా పెళ్లయిన జంట పోగొట్టుకున్న సె* టేప్ గురించిన కామెడీ. టైటిల్ జంటగా రాజ్‌కుమార్ - త్రిప్తి లతో పాటు ఈ చిత్రంలో మల్లికా షెరావత్, విజయ్ రాజ్, రాకేష్ బేడి, అర్చన పురాణ్ సింగ్, టికు తల్సానియా, ముఖేష్ తివారీ కూడా నటించారు. విక్కీ ఔర్ విద్యా కా వో వాలా వీడియో అక్టోబర్ 11 న థియేటర్లలో విడుదల కానుంది. అలియా భట్ జిగ్రాతో ఈ మూవీ ఢీకొంటుంది.