ఆ బోల్డ్ బ్యూటీది మామూలు గుండె కాదు!
అవకాశాల కోసం తానెంత కష్టప డాల్సి వచ్చిందన్నది చాలా సందర్భాల్లో రివీల్ చేసింది.
బాలీవుడ్ బ్యూటీ త్రిప్తీ డిమ్రీ పాన్ ఇండియాలో ఇప్పుడెంతో ఫేమస్. 'యానిమల్' సక్సెస్ తో అమ్మడి స్టార్ డమ్ మారిపోయిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ అయిపోయింది. అయితే నటిగా ఇంత బిజీ కాకముందు ఇండస్ట్రీలో ఎన్నో విమర్శలు, అవమానాలు సైతం ఎదుర్కుంది. అవకాశాల కోసం తానెంత కష్టప డాల్సి వచ్చిందన్నది చాలా సందర్భాల్లో రివీల్ చేసింది.
'యానిమల్' సక్సెస్ అన్నది ఒక్క రాత్రిలో వచ్చిందని ప్రేక్షకులు భావిస్తే? దాని సక్సెస్ వెనుక ఎన్నో నిద్ర లేని రాత్రుళ్లు ఉన్నాయని, యానిమల్ ముందుకు త్రిప్తి అనేది ఎలా ఉండేది అన్నది తన సన్నిహితులు తప్ప ఇంకెవ్వరికీ తెలియదని చెప్పకనే చెప్పింది. ఇండస్ట్రీలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? సోషల్ మీడియా యుగంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది? ఇలా ప్రతీ అనుభవాన్ని పూస గుచ్చి మరీ చెప్పింది.
ఇలాంటివి కేవలం సక్సెస్ అయిన వాళ్లు చెబితేనే వింటారు? ఫెయిలైన వాళ్లు చెబితే జనాలు కూడా వినరని తన అసహనాన్ని వెళ్లగక్కిన సందర్బం కూడా ఉంది. వ్యాపార వేత్త సామ్ మర్చంట్ తో త్రిప్తి డేటింగ్ చేస్తుందని రెండేళ్ల క్రితం పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అతడితో కలిసి ఉన్న ఫోటోలను త్రిప్తీ స్వయంగా పోస్ట్ చేయడంతో? విషయం బయటకు వచ్చింది.
అయితే వాళ్లది రిలేష్ షిప్ కాదని..కేవలం స్నేహం మాత్రమేనని త్రిప్తీ సన్నిహితులు అప్పట్లోనే ఖండించారు. కానీ దీనికి గురించి త్రిప్తీ మాత్రం ఎక్కడా స్పందించలేదు. అయితే ఈ రకమైన సోషల్ మీడియా ప్రచారం కారణంగా త్రిప్తీ మనసెంతో గాయపడింది? అన్న సంగతి ఆమె మాటల్లో అర్దమవుతుంది. కీర్తితో పాటు ప్రవైసీని కోల్పోవడం ఇష్టం లేకనే ఇలాంటి విషయాల గురించి తానెక్కడా మాట్లాడు దలుచుకోలేదని తెలిపింది. జీవితంలో తాను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా? అన్ని రకాల స్థితులను తట్టుకునే గుండె దైర్యం తనకు ఉందని చెప్పకనే చెప్పింది.