బాబోయ్.. ప్రభాస్ మూవీ గురించి త్రిష!
త్రిష ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్‌తో కలిసి నటించిన వర్షం గురించిన విషయాలను పంచుకుంది.
వయసు 40 సంవత్సరాలకు పైగా ఉండి, ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి 20 సంవత్సరాలకు పైగా పూర్తి చేసుకున్న త్రిష ఇంకా కోలీవుడ్, టాలీవుడ్‌లో పెద్ద హీరోలతో వరుసగా సినిమాలు చేస్తోంది. బాలీవుడ్‌లో అతి కొద్ది మంది హీరోయిన్స్ మాత్రమే ఇలా లేటు వయసులో అందాల ఆరబోత చేస్తూ వరుసగా హీరోయిన్స్‌గా సినిమాలు చేస్తూ ఉన్నారు. సౌత్‌లో త్రిష స్థాయి సీనియర్ హీరోయిన్స్ హీరోయిన్స్‌గా ఈ స్థాయిలో బిజీగా లేరని చెప్పాలి. కొందరు ఇంకా ఇండస్ట్రీలో ఉన్నా వారు పెద్దగా సినిమాల్లో ఆఫర్లు రాకపోవడంతో ఉన్నారా లేరా అన్నట్లుగా ఉన్నారు. కానీ త్రిష మాత్రం తెలుగులో చిరంజీవితో నటిస్తూ ఉండగా, తమిళ్‌లో సూపర్ స్టార్‌తో నటిస్తూ ఉంది.
తెలుగు, తమిళంలో దాదాపు అందు సీనియర్ హీరోలతో, యంగ్ స్టార్ హీరోలతో నటించిన త్రిష ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్‌తో కలిసి నటించిన వర్షం గురించిన విషయాలను పంచుకుంది. వర్షం సినిమా కోసం తాను ఏకంగా 40 రోజుల పాటు నీటిలో తడుస్తూ షూటింగ్‌లో పాల్గొన్నాను. షూటింగ్ ప్రారంభంకు ముందే నీటిలో ఎక్కువగా తడుస్తూ నటించాల్సి ఉంటుందని దర్శకుడు శోభన్ చెప్పారు. కానీ ఆ స్థాయిలో నీటిలో తడుస్తూనే ఉండాలని నేను అనుకోలేదు. ఎక్కువ రోజులు నీటిలో తడుస్తూనే షూట్ లో పాల్గొన్నాం. సన్నివేశాలు కాకుండా పాటలను సైతం వర్షంలో షూట్ చేయడం జరిగింది.
ఆ దెబ్బకు వర్షంలో షూట్ అంటేనే భయం వేసింది. బాబోయ్ వర్షం సినిమానా, బాబోయ్ నీటిలో సీన్స్ ఉన్నాయా అంటూ భయపడ్డాను. వర్షం సినిమాలో నటించిన తర్వాతే త్రిషకి స్టార్‌డం దక్కింది. ప్రభాస్ స్టార్ హీరోగా గుర్తింపు దక్కించుకోగా, త్రిషకి టాలీవుడ్‌లో టాప్ స్టార్ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు వచ్చాయి. అయినా వర్షం సినిమాలోని వర్షపు నీటిలో సన్నివేశాలు అంటే ఇప్పటికీ బాబోయ్ అనిపిస్తుందని త్రిష ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ప్రభాస్, త్రిషలది వర్షంతో హిట్ పెయిర్ కావడంతో ఆ తరవ్ఆత వీరిద్దరి కాంబోలో పౌర్ణమి, బుజ్జిగాడు సినిమాల్లో నటించారు. ఆ తర్వాత మళ్లీ ఇద్దరూ కలిసి నటించలేదు.
మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ప్రభాస్, త్రిష కలిసి నటించే అవకాశాలు ఉన్నాయి అనే వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ సినిమాలో త్రిష నటించే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఆ విషయమై క్లారిటీ రాలేదు. కానీ ప్రభాస్ డ్యూయెల్ రోల్ అని, తండ్రి పాత్రకు జోడీగా త్రిష నటించే అవకాశాలు ఉన్నాయి అంటూ ప్రచారం జరుగుతుంది. అదే కనుక నిజం అయితే ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు త్రిష ఫ్యాన్స్‌కి కచ్చితంగా బిగ్ ఫెస్టివల్ అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ విషయమై త్వరలో క్లారిటీ వస్తుందేమో చూడాలి.