నాడు విమర్శలు ..నేడు ప్రశంసలు!
వయసు వ్యత్యాసం కూడా బ్యాలెన్స్ అవుతుందంటూ పొగిడేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి-త్రిష జంటగా 18 ఏళ్ల అనంతరం మళ్లీ కలిసి నటిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇద్దరు వశిష్ట దర్శకత్వం వహిస్తోన్న `విశ్వంభర`లో నటిస్తున్నారు. ఈ కాంబో సెట్ అవ్వగానే అంచనాలు ఏ రేంజ్లో పెరిగిపోయో చెప్పాల్సిన పనిలేదు. చిరుకి పర్పెక్ట్ జోడీ అంటూ ఓ రేంజ్ లో ప్రశంసల వర్షం కురిపించింది. పైగా త్రిష ఫాంలో ఉండటం...మునుపటి కంటే మరింత అందంగానూ ఉండటంతో సూపర్ జోడీ అంటూ ఆకాశానికి ఎత్తేస్తు న్నారు. చిరుకి సరైన నాయిక త్రిష మాత్రమేనంటూ కామెంట్లు మాములుగా లేవు.
వయసు వ్యత్యాసం కూడా బ్యాలెన్స్ అవుతుందంటూ పొగిడేస్తున్నారు. మరి ఒకప్పుడు ఇదే కాంబినేషన్ ని 18 ఏళ్ల క్రితం స్టాలిన్ సమయంలో ఎంతగా విమర్శించారో గుర్తుందా? అప్పుడు సోషల్ మీడియా లేదు...స్మార్ట్ ఫోన్ లేదు. కేవలం టీవీ ఛానెళ్లలో..వార్తా పత్రికల్లో ఆ కాంబో సెట్ అవ్వడంతో అప్పటి యువత చిరుకు కుమార్తె లా ఉంది! ఆయన సరసన ఈవిడ హీరోయిన్ ఏంటి? అని విమర్శించారు. ఆ కాంబినేషన్ సెట్ చేసింది ఎవరు? అది దర్శకుడు మురగదాస్ ఛాయిస్ నా ? చిరు ఛాయిస్ నా? అంటూ కొంత వ్యతిరేకత వ్యక్తమైంది.
అప్పుడు చిరంజీవి వయసు కూడా తక్కువే...త్రిష వయసు అంతకన్నా చిన్నది. అయితే అప్పటికీ ఇప్పటికీ త్రిషలో చాలా మార్పులొచ్చాయి. చిరు లో సైతం చాలా ఛేంజెస్ కనిపిస్తున్నాయి. వయసు ముదురుతోన్న కొద్ది యంగ్ గా మారిపోతారు. చిరు మునుపటి కంటే కూడా బాగా స్లిమ్ అయ్యారు. త్రిష మాత్రం కాస్త చబ్బీ లుక్ లో ఉంది. అలా మెయింటెన్ చేయడం వల్లే ఇప్పుడు విమర్శలకు తావు ఇవ్వలేదు. లేదంటే మళ్లీ అతే తరహా వ్యతిరేకత వ్యక్తమయ్యేదేమో.
మరి నాటి `స్టాలిన్` మరీ అంత మోత మ్రోగించలేదు కానీ నేటి `విశ్వంభర` ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమా సెట్స్ లో ఉంది. చిరు-త్రిష ఇద్దరు షూటింగ్ కూడా హాజరవుతున్నారు. మరి ఈ కాంబో తెరపై ఎంత అందంగా కనిపిస్తుందో చూడాలి.