ఆమె చిరుతో ముగించి వెంకీతో షురూ...!

అంతే కాకుండా లేడీ ఓరియంటెడ్‌ సినిమాలకు కూడా మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్ గా నిలిచి వరుసగా సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే.

Update: 2024-08-21 02:30 GMT

2002లో తమిళ సినిమా మౌనం పేసియాదే తో హీరోయిన్‌ గా కెరీర్ ను ప్రారంభించిన త్రిష రెండు దశాబ్దాలు పూర్తి అయిన తర్వాత కూడా బిజీ బిజీగా సినిమాలు చేస్తూనే ఉంది. హీరోయిన్ గా ఇన్నాళ్ల కెరీర్‌ ను కంటిన్యూ చేసిన వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. త్రిష తో పాటు కెరీర్‌ ను ఆరంభించిన చాలా మంది హీరోయిన్స్ కనుమరుగయ్యారు. కానీ త్రిష మాత్రం ఇప్పటికి స్టార్‌ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌ గా సినిమాలు చేస్తోంది. అంతే కాకుండా లేడీ ఓరియంటెడ్‌ సినిమాలకు కూడా మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్ గా నిలిచి వరుసగా సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే.


మూడు నాలుగు సంవత్సరాలుగా టాలీవుడ్‌ సినిమాల కంటే కూడా ఎక్కువగా కోలీవుడ్‌ సినిమాలపై దృష్టి పెట్టిన త్రిష మళ్లీ తెలుగు సినిమాల వైపు అడుగులు వేస్తోంది. ఇప్పటికే చిరంజీవితో విశ్వంభర సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. అక్టోబర్ లేదా నవంబర్‌ వరకు విశ్వంభర సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. చిరు తో చేస్తున్న విశ్వంభర సినిమా పూర్తి అవ్వడమే ఆలస్యం వెంటనే వెంకటేష్ తో కలిసి ఒక సినిమాను చేసేందుకు త్రిష గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందనే వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ ఒక సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమాలో మీనాక్షి చౌదరి మరియు ఐశ్వర్య రాజేష్ లు హీరోయిన్స్‌ గా నటిస్తున్నారు. అనిల్‌ రావిపూడితో చేస్తున్న సినిమా తర్వాత వెంకటేష్ 'సామజవరగమన' చిత్ర రచయిత నందు దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్నాడు. ఇటీవలే ఈ సినిమా కన్ఫర్మ్‌ అయ్యింది. హీరోయిన్‌ గా త్రిష ను సంప్రదించారని తెలుస్తోంది. విశ్వంభర సినిమాను పూర్తి చేసిన తర్వాత వెంకటేష్ తో షూటింగ్‌ లో త్రిష జాయిన్‌ అవ్వబోతుందట. వీరి కాంబో మూవీ 2025 సమ్మర్ లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.

త్రిష తెలుగు లో చివరగా నాయకి సినిమాలో నటించింది. ఆ సినిమా నిరాశ పరచడంతో ఎక్కువగా తమిళ సినిమాలకే మొగ్గు చూపుతూ వచ్చింది. ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సొంతం చేసుకోవడంతో పాటు, పలు వ్యక్తిగత విషయాల కారణంగా కూడా త్రిష తమిళ సినిమాలు చేస్తూ వచ్చినట్లు తెలుస్తోంది. హీరోయిన్‌ గా త్రిష తెలుగు లో మళ్లీ వరుస సినిమాలు చేసేందుకు ఓకే చెబుతున్న నేపథ్యంలో ఆమె తెలుగు ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ బాబు, పవన్‌ కళ్యాణ్ వంటి స్టార్‌ హీరోలు కూడా ఈమె తో నటించాలని కొందరు ఆశిస్తున్నారు. మరి వారి సినిమాలు ఈమెతో ఉంటాయా అనేది చూడాలి.

Tags:    

Similar News