ఆ సూపర్ హిట్ కాంబో కోసం ఫ్యాన్స్ వెయిటింగ్..!

ఇక పవన్ కళ్యాణ్ తో హ్యాట్రిక్ మూవీగా చేసిన అజ్ఞాతవాసి సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించాడు

Update: 2024-02-26 16:30 GMT

హీరో డైరెక్టర్ కాంబినేషన్.. హీరో హీరోయిన్ కాంబినేషన్ మాత్రమే కాదు డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ కాంబినేషన్ కూడా కొన్నిసార్లు బాగా వర్క్ అవుట్ అవుతుంది. రాజమౌళి తన ప్రతి సినిమాకు కీరవాణిని మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపిక చేసుకుంటాడు. సుకుమార్ కూడా తన ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ గా దేవి శ్రీ ప్రసాద్ ని ఫిక్స్ చేసుకున్నాడు. అలా డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ కాంబో సూపర్ హిట్ అయ్యాయి. అయితే అలాంటి కాంబో ఒకటి త్రివిక్రమ్ దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్.

త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన జల్సా సినిమా నుంచి అతన్ని రిపీట్ చేశాడు. మధ్యలో ఖలేజా ఒక్కటి మణిశర్మతో చేశారు కానీ ఆ తర్వాత జులాయి, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, ఇలా అన్ని సినిమాలకు త్రివిక్రమ్ దేవి శ్రీ ప్రసాద్ నే మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నాడు. అయితే ఈ సూపర్ హిట్ కాంబో కి ఎందుకో పెద్ద బ్రేక్ పడింది. త్రివిక్రమ్ చేసిన అ ఆ సినిమాకు మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందించాడు. ఆ సినిమా సక్సెస్ లో మ్యూజిక్ కూడా మంచి ప్రాధాన్యత వచ్చేలా చేశారు.

ఇక పవన్ కళ్యాణ్ తో హ్యాట్రిక్ మూవీగా చేసిన అజ్ఞాతవాసి సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించాడు. ఆ సినిమా మ్యూజిక్ ఆబ్లం పరంగా హిట్ అయినా కమర్షియల్ గా వర్క్ అవుట్ కాలేదు. ఇక తర్వాత తీసిన అరవింద సమేత నుంచి త్రివిక్రమ్ థమన్ తో కలిసి పనిచేశాడు. అరవింద సమేత, అల వైకుంఠపురములో, గుంటూరు కారం ఇలా హ్యాట్రిక్ సినిమాలతో హ్యాట్రిక్ హిట్లతో థమన్ త్రివిక్రమ్ ఇద్దరు సూపర్ కాంబో అనిపించుకున్నారు.

ఈ క్రమంలో త్రివిక్రమ్ డైరెక్షన్ లో మరోసారి దేవి మ్యూజిక్ డైరెక్షన్ సాంగ్స్ వినాలని అనుకుంటున్నారు ఆడియన్స్. జల్సా, అత్తారింటికి దారేది, జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి ఇలా త్రివిక్రమ్ దర్శకత్వంలో దేవి ఇచ్చిన సాంగ్స్ అన్ని సూపర్ హిట్ అయ్యాయి. మళ్లీ ఈ కాంబో రిపీట్ అయితే మరో ఎనర్జిటిక్ ఆల్బం వస్తుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. త్రివిక్రం నెక్స్ట్ సినిమాకు థమన్ ని రిపీట్ చేస్తాడా లేదా దేవి శ్రీ ప్రసాద్ ని తీసుకుంటాడా అన్నది తెలియాల్సి ఉంది. దేవి శ్రీ ప్రసాద్ తో త్రివిక్రమ్ పనిచేయకపోవడానికి వారిద్దరి మధ్య ఏదో చిన్న డిస్టబెన్స్ వచ్చిందని అప్పట్లో టాక్. అయితే అదేంటి అన్నది క్లారిటీ లేదు కానీ ఇద్దరు కలిసి పనిచేస్తే దూరం కాస్త దగ్గరయ్యే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.

Tags:    

Similar News