త్రివిక్రమ్ బ్రో రెమ్యునరేషన్.. వారి కంటే ఎక్కువే?
త్రివిక్రమ్ శ్రీనివాస్ బ్రో సినిమా
త్రివిక్రమ్ శ్రీనివాస్ బ్రో సినిమాకు డైలాగ్స్ మాత్రమే కాకుండా స్క్రీన్ ప్లే కూడా అందించిన విషయం తెలిసిందే. తమిళ దర్శకుడు సముద్రఖని దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న ఈ సినిమా పనులన్నీ కూడా త్రివిక్రమ్ ప్లానింగ్ తోనే జరిగాయి. ఇక ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ మొదటిసారి కలిసి నటించారు.
ఇక ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ డీల్స్ కూడా చాలావరకు క్లోజ్ అయ్యాయి. ఈనెల 28వ తేదీన గ్రాండ్ గా విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమా కోసం ఎంత పారితోషకం అందుకున్నారు అనే విషయం హాట్ టాపిక్ గా మారిపోయింది.
సాధారణంగా త్రివిక్రమ్ గత కొంతకాలంగా దర్శకుడిగా సినిమాలు చేస్తూ రెమ్యునరేషన్ కాకుండా లాభాల్లో వాటా తీసుకుంటున్నారు. అయితే ఈసారి బ్రో సినిమాకు మాత్రం ఆయన కాస్త ఎక్కువ స్థాయిలోనే పారితోషకం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఒక విధంగా సాయి ధరమ్ తేజ్ దర్శకుడు సముద్రఖని కంటే ఎక్కువగా త్రివిక్రమ్ శ్రీనివాస్ పారితోషకం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
దాదాపు 20 కోట్ల రేంజ్ లోనే ఆయనకు అందినట్లు టాక్. అయితే కేవలం ఇది పారితోషకం కాదు అని సమాచారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రాజెక్టు నిర్మాణంలో కూడా కొంత భాగస్వామిగా ఉండాలని అనుకుంమరు. ఇక పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తో ఆయన మొదట భాగస్వామిగానే సినిమాను నిర్మించాలని అనుకున్నారు. కానీ ఆ తర్వాత మళ్లీ ఎందుకో పూర్తిస్థాయిలో ప్రొడక్షన్లో కలగజేసుకోలేదు.
దీంతో ఆయనకు 20 కోట్లు ఇచ్చేసి పూర్తి బిజినెస్ వ్యవహారాలు అన్నీ కూడా పీపుల్స్ మీడియా తీసుకున్నట్టు టాక్. డీల్స్ విషయంలో అయితే త్రివిక్రమ్ కలుగజేసుకోలేదని తెలుస్తోంది. మొత్తంగా కేవలం ఒక రైటర్ గానే త్రివిక్రమ్ అత్యధిక స్థాయిలో పరితోషకం అందుకున్నారు. ఇది ఆయన కెరీర్లో రైటర్ గా బెస్ట్ రికార్డు అని చెప్పవచ్చు.
ఇక బ్రో సినిమాలో పవన్ కళ్యాణ్ కనిపించేది కొద్ది సేపే అయినప్పటికీ కూడా ఆయన 35 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక సాయిధరమ్ తేజ్ 20 కోట్ల కంటే తక్కువగానే తీసుకున్నాడు. ఇక దర్శకుడు సముద్రఖని 7 కోట్ల రేంజ్ లో తీసుకున్నట్లుగా తెలుస్తోంది.