భోళాని ఆడేసుకుంటున్న నెటిజన్లు..!

ఓటీటీలో రిలీజైన భోళా శంకర్ సినిమాను ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు నెటిజన్లు. ముఖ్యంగా యాంటీ ఫ్యాన్స్ అయితే భోళా జీ క్యా జీ అనేస్తున్నారు.

Update: 2023-09-17 01:30 GMT

మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా ఆగష్టు 11న థియేట్రికల్ రిలీజైంది. ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో అనిల్ సుంకర నిర్మించగా మెహర్ రమేష్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమా తమిళ మూవీ వేదాళం రీమేక్ గా తెరకెక్కించారు. సినిమాపై మొదటి నుంచి అనుమానంగా ఉన్న మెగా ఫ్యాన్స్ కి మొదటి షో చూశాక ఇది ఊహించిందే కదా అని అనుకున్నారు. ఎంత పెద్ద మెగాస్టార్ అయినా కూడా కంటెంట్ లేకపోతే మాత్రం సినిమాలు ఆడవని ప్రూవ్ చేసింది. మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ థియేటర్ లో చూసేందుకు ఆసక్తి చూపని కొందరు ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూశారు.

శుక్రవారం నెట్ ఫ్లిక్స్ లో భోళా శంకర్ రిలీజైంది. సినిమా చూసి మరోసారి సినిమా గురించి ట్రోల్స్ మొదలయ్యాయి. మీమ్స్, ట్రోల్స్ తో మరోసారి భోళా శంకర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఒక సినిమా హిట్ అయితే ఎన్ని ప్రశంసలు వస్తాయో అదే సినిమా ఫ్లాపై ఆడియన్స్ అంచనాలను రీచ్ కాకపోతే మాత్రం లెక్క వేరేలా ఉంటుంది. భోళా శంకర్ సినిమా విషయంలో అదే జరిగింది.

ఓటీటీలో రిలీజైన భోళా శంకర్ సినిమాను ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు నెటిజన్లు. ముఖ్యంగా యాంటీ ఫ్యాన్స్ అయితే భోళా జీ క్యా జీ అనేస్తున్నారు. ఇదే టైం లో ఏకె ఎంటర్టైన్మెంట్స్ నుంచి వచ్చిన మరో సినిమా ఏజెంట్ గురించి కూడా ఇక్కడ ప్రస్తావించాల్సి ఉంది. ఏజెంట్ సినిమా భారీ హైప్ తో రిలీజై ఏమాత్రం అంచనాలను అందుకోలేదు. ఫస్ట్ షోతోనే డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ఏజెంట్ థియేట్రికల్ రిలీజై ఇన్నాళ్లు అవుతున్నా సరే ఓటీటీ రిలీజ్ కు నోచుకోలేదు. ఈ రెండు సినిమాల వల్ల నిర్మాత భారీగా నష్టపోయాడని తెలుస్తుంది.

ఏజెంట్ సినిమాను సోనీ లివ్ సొంతం చేసుకుంది. మరి ఈ సినిమాను ఎందుకు వారు రిలీజ్ చేయకుండా ఆపుతున్నారన్నది తెలియాల్సి ఉంది. ఇదే కాదు థియేట్రికల్ రిలీజై ఓటీటీ రిలీజ్ కోసం చాలా సినిమాలు వెయిటింగ్ లో ఉన్నాయని తెలుస్తుంది. సినిమా థియేట్రికల్ హిట్ అయితే ఆ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూసే ఫ్యాన్స్ డిజాస్టర్ సినిమాలను మాత్రం ఓటీటీ రిలీజైనా పట్టించుకోవడం లేదు. కరోనా టైం లో డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ అయ్యాయి కానీ ఇప్పుడు ప్రతి సినిమా థియేట్రికల్ రిలీజ్ తర్వాతే ఓటీటీకి ఇస్తున్నారు. అయితే అక్కడ రిజల్ట్ ని బట్టే ఓటీటీ రిలీజ్ ఆధారపడి ఉందని చెప్పొచ్చు.

Tags:    

Similar News