ఫేమస్ సింగర్ కన్సర్ట్ కి తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు!
నేడు అదే ఈవెంట్ హైదరాబాద్ లో జరుగుతుంది. అయితే దిల్జీత్ ఈవెంట్ కి తెలంగాణ సర్కార్ ఆంక్షలు విధించింది.
ఇండియాలో మ్యూజిక్ కన్సర్ట్ లు జోరందుకున్న సంగతి తెలిసిందే. మునుపటి కంటే అధికంగా ఈ తరహా ఈవెంట్లు జరుగుతున్నాయి. రెహమాన్, ఇళయరాజా లాంటి లెజెండ్స్ మాత్రమే ఇలాంటి వేడుకలు నిర్వహించే వారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఫేమస్ అయిన వారంతా మ్యూజిక్ కన్సర్టులు నిర్వహిస్తున్నారు. ఇటీవలే రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఓమ్యూజిక్ కన్సర్ట్ నిర్వహించిన సంగతి తెలిసిందే.
భారీ ఎత్తున ఈ వెంట్ జరిగింది. అన్నిరకాల పాటలతో..ముఖ్యంగా మెగా ఫ్యామిలీ పాటలతో ఈవెంట్ ని గ్రాండ్ సక్సెస్ చేసారు. హైదరాబాద్ తర్వాత దేశంలో పలు పట్టణాల్లో ఇలాంటి కన్సర్టులు ప్లాన్ చేసుకుని ముందు కెళ్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా బాలీవుడ్ ఫేమస్ సింగర్ దిల్జీత్ దోశాంజ్ కూడా ఇలాంటి కన్సర్ట్ నిర్వహి స్తున్నాడు. నేడు అదే ఈవెంట్ హైదరాబాద్ లో జరుగుతుంది. అయితే దిల్జీత్ ఈవెంట్ కి తెలంగాణ సర్కార్ ఆంక్షలు విధించింది.
ఈవెంట్ లో ఆల్కాహాల్, డ్రగ్స్ ని ప్రోత్సహించే పాటలు పాడరాదని ప్రభుత్వం నోటీసులిచ్చింది. అలాగే పిల్లల్ని స్టేజ్ షోకి వాడుకోవద్దని, ప్లాష్ లైట్స్, లౌడ్స్ కి కూడా అనుమతి లేదని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇలా పనిగట్టుకుని ఆంక్షలు విధించడానికి బలమైన కారణంగా ఉంది. దిల్జీత్ గత ఈవెంట్ దేశ రాజధాని ఢిల్లీ లో జరిగింది. అక్కడ ఆల్కాహాల్, డ్రగ్స్, హింసను ప్రోత్సహించేలా కొన్ని పాటలు పాడినట్లు ఆరోపణలున్నాయి.
ఈ నేపథ్యంలో టీ-ప్రభుత్వం ఇలాంటి ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. పంజాబీ సింగర్ల పాటలు ఎలా ఉంటాయి? అన్నది చెప్పాల్సిన పనిలేదు. యువతలో ఊపును తీసుకొస్తాయి. స్టేజ్ పై సింగర్ పాడుతుంటే? చూసేవారంతా వాళ్లతోపాటు ఊగిపోతుంటారు. కొన్ని సందర్భాల్లో అలాంటి ఘటనలు తీవ్ర గొడవలకు సైతం దారి తీసాయి. ఈ క్రమంలో పోలీసు సిబ్బంది సైతం వారిని అదుపు చేయడం కష్టతరంగా మారుతుంది.