తుంబాడ్ రీరిలీజ్… కలెక్షన్స్ తో ఊచకోత

మూడు రోజుల్లో ఈ చిత్రం ఏకంగా 7.34 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుందని తెలుస్తోంది. ఆదివారం ఒక్కరోజే ఏకంగా 3.04 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

Update: 2024-09-16 10:45 GMT

ఇండియన్ హిస్టరీలో కొన్ని సినిమాలకి మాత్రమే క్లాసిక్ అనే ట్యాగ్ వర్తిస్తుంది. అండర్ రేటెడ్ గా వచ్చి ఎవ్వరు ఊహించని సక్సెస్ ని సొంతం చేసుకోవడం ద్వారా ఎవర్ గ్రీన్ క్లాసిక్ మూవీస్ గా నిలిచినవి చాలా ఉన్నాయి. వాటిలో తుంబాడ్ ఒకటి. 2018లో రిలీజ్ అయిన ఈ సినిమాకి రాహి అనిల్ బార్వే దర్శకత్వం వహించారు. ఈ సినిమాని తెరకెక్కించడానికి చాలా టైమ్ తీసుకున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్ లోకి వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది.

ఏకంగా 13.6 కోట్ల కలెక్షన్స్ ని ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా అందుకుంది. అలాగే 64వ ఫిల్మ్ పేర్ లో 3 కేటగిరీలలో ఈ సినిమాకి అవార్డులు వచ్చాయి. బాలీవుడ్ లో కల్ట్ క్లాసిక్ మూవీస్ లో ఇది ఒకటని సినీ విశ్లేషకులు అంటూ ఉంటారు. ఓ కొత్తరకమైన అనుభూతిని ఈ హర్రర్ డ్రామాతో దర్శకుడు రాహు అనిల్ బార్వే ఇవ్వగలిగాడు. ఇక ఈ సినిమాకి జెస్పర్ కైడ్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించారు. ఈ సంగీతం కూడా సినిమాకి డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది.

ఇప్పటికే ఈ చిత్రాన్ని థియేటర్స్ తో పాటు ఓటీటీలో కూడా చాలా మంది చూసేసారు. అయిన కూడా తుంబాడ్ థియేటర్స్ ఎక్స్ పీరియన్స్ ఆస్వాదించడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 13న మరల థియేటర్స్ లో రీరిలీజ్ చేశారు. రీరిలీజ్ లో కూడా ఈ సినిమాకి అద్భుతమైన కలెక్షన్స్ వస్తున్నాయంట. మూడు రోజుల్లో ఈ చిత్రం ఏకంగా 7.34 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుందని తెలుస్తోంది. ఆదివారం ఒక్కరోజే ఏకంగా 3.04 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

ఈ సినిమా మొదటి సారి రిలీజ్ అయినపుడు వీకెండ్ లో వచ్చిన కలెక్షన్స్ తో పోల్చుకుంటే రీరిలీజ్ లో 125% అధికంగా వచ్చాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. సోమవారం కూడా ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఫస్ట్ టైం రిలీజ్ అయినపుడు వచ్చిన కలెక్షన్స్ కంటే రీరిలీజ్ లోనే తుంబాడ్ సినిమాకి ఎక్కువ వసూళ్లు వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని సినీ విశ్లేషకులు అంటున్నారు.

మొదటి సారి థియేటర్స్ లో చూడని వారు ప్రస్తుతం చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో సినిమాకి మంచి ఆదరణ వస్తోంది. లాంగ్ రన్ లో ఈ సినిమా ఏ మేరకు కలెక్షన్స్ ని సాధిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే రీసెంట్ గా ఈ మూవీ ప్రొడ్యూసర్ లలో ఒకరైన సోహమ్ షా తుంబాడ్ సీక్వెల్ ఉంటుందని చెప్పారు. అయితే ఈ సీక్వెల్ ఎప్పుడు ఉంటుందనేది క్లారిటీ ఇవ్వలేదు.

Tags:    

Similar News