టీవీ మూవీ నటి ప్లాస్టిక్ సర్జరీ ఫెయిల్?
ఇటీవలి ఈవెంట్‌లో రాధిక మదన్ ముఖం భిన్నంగా కనిపించింది! అంటూ నెటిజన్లు దారుణంగా కామెంట్ చేస్తున్నారు.
బాలీవుడ్ టు టాలీవుడ్ కథానాయికలు తమ అందాన్ని పెంచుకునేందుకు సర్జరీలను ఆశ్రయించారని కథనాలొచ్చాయి. శ్రీదేవి మొదలు నేటితరంలో శ్రుతిహాసన్ వరకూ ఇలాంటి శస్త్ర చికిత్సలు చేయించుకున్నవారి జాబితాలో ఉన్నారు. దవి .. ముక్కు.. ముఖంలో ఏదైనా భాగానికి శస్త్ర చికిత్స చేయడం ద్వారా అందాన్ని మెరుగుపరచుకునేందుకు తపించిన భామలు ఎందరో... ఇప్పుడు అదే బాటలో ప్రముఖ టీవీ మూవీ నటి రాధిక మదన్ తన ముఖానికి శస్త్ర చికిత్స చేయించుకుందంటూ ప్రచారం సాగుతోంది.
ఇటీవలి ఈవెంట్‌లో రాధిక మదన్ ముఖం భిన్నంగా కనిపించింది! అంటూ నెటిజన్లు దారుణంగా కామెంట్ చేస్తున్నారు. అంతేకాదు.. కొందరు `మరో శస్త్రచికిత్స తప్పుగా జరిగింది`` అని వ్యాఖ్యానిస్తున్నారు. రాధిక కొంతకాలం క్రితం పెద్ద తెరపైకి ప్రవేశించి చాలా మంది హృదయాలను కొల్లగొట్టింది. ఇంతలోనే ఒక ఈవెంట్‌లో చాలా భిన్నంగా కనిపించింది. శస్త్ర చికిత్స వికటించడం వల్లనే ఇలా కనిపిస్తోందంటూ ఫ్యాన్స్ కామెంట్లతో విరుచుకుపడుతున్నారు.
ఆరంగేట్రం టీవీ కెరీర్‌ను కొనసాగించిన రాధిక తర్వాత విజయవంతంగా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన అతికొద్ది మంది నటీమణులలో ఒకరిగా నిలిచారు. ఇషానీగా కలర్స్ `మేరీ ఆషికి తుమ్సే హాయ్`లో తన టీవీ అరంగేట్రం చేసిన రాధిక పెద్ద తెరపై శక్తి అరోరా సరసన కనిపించింది. నటి కొంతకాలం క్రితం చలనచిత్ర ప్రపంచంలోకి ప్రవేశించి చాలా మంది హృదయాలను కొల్లగొట్టింది. కానీ ఇటీవల ఒక ఈవెంట్‌లో చాలా భిన్నంగా కనిపించింది. ఆమె ముఖమార్పిడి చికిత్స చేయించుకుందంటూ ఒక వినియోగదారు తన పాత చిత్రంతో పోలుస్తూ తాజా ఫోటోగ్రాఫ్ ని పోస్ట్ చేసారు. అందులో రాధిక చాలా భిన్నంగా కనిపిస్తోంది.
ప్లాస్టిక్ సర్జరీ తో దేవుడు మీకు ఇవ్వనిది డాక్టర్ ఇస్తాడు. వీళ్లంతా ఎందుకు ఇలా చేస్తారో నాకు అర్థం కాలేదు! ఆమెది చాలా అందమైన ముఖం! కానీ ఇలా చేసిందని భావిస్తున్నారా? .. అని ఒకరు వ్యాఖ్యానించగా, బొటాక్స్ వర్కింగ్ ఇట్స్ మ్యాజిక్! అని మరొకరు వ్యాఖ్యానించారు. మరొక నెటిజన్ శస్త్రచికిత్స తప్పుగా జరిగిందని వ్యాఖ్యానించారు.
అయితే తనపై కామెంట్లను చూసి రాధిక ఇలా మదనపడింది. పటాఖా కోసం దాదాపు 12 కిలోలు పెరిగాను. ఆ సమయంలో నేను సిగ్గుపడ్డాను. నేను అంగ్రేజీ కోసం బరువు తగ్గినప్పుడు సిగ్గుపడ్డాను. నేను షిద్దత్ చేసినప్పుడు ఇంతకంటే బరువుగా ఉన్నప్పుడు సిగ్గుపడ్డాను. నేను బరువు తగ్గినట్లయితే సిగ్గుపడుతున్నాను. ప్రజలు తమలో తాము చూసుకున్న వాటిని మనలో చూశారని నేను భావిస్తున్నాను. నాతో నేను సరిగ్గా ఉంటేనే సంతోషంగా ఉన్నాను అని తెలిపింది.