కేంద్ర ప్ర‌భుత్వం కూడా ఓటీటీ మార్కెట్ లోకి!

మార్కెట్ లో ఓటీటీల మ‌ధ్య కాంపిటీష‌న్ ఏ రేంజ్ లో ఉందో చెప్పాల్సిన ప‌నిలేదు.

Update: 2024-05-14 08:27 GMT

మార్కెట్ లో ఓటీటీల మ‌ధ్య కాంపిటీష‌న్ ఏ రేంజ్ లో ఉందో చెప్పాల్సిన ప‌నిలేదు. ప్ర‌స్తుతం భార‌త్ లో విదేశీ కంపెనీల హ‌వా న‌డుస్తుంది. వాటితోపాటుస్వ‌దేశీ ఓటీటీలు పెద్ద ఎత్తున పోటీలో ఉన్నాయి. బాలీవుడ్... టాలీవుడ్.. కోలీవుడ్ ..మాలీవుడ్ నుంచి అనేక మంది నిర్మాత‌లు..హీరోలు..హీరోయిన్లు సొంతంగా ఓటీటీలు స్థాపించి మార్కె ట్లో పోటీ ప‌డుతున్నారు. విదేశీ కంపెనీలో వాళ్ల కంపెనీలో పోటీని త‌ట్టుకోవ‌డం క‌ష్టంగా క‌నిపిస్తుంది.

క్వాలిటీ కంటెట్..యూనిక్ కంటెంట్ అందించ‌డంలో విదేశీ కంపెనీలు ముందు వ‌రుస‌లో ఉండ‌టంతోనే ఇది సాధ్య‌మైంది. రాను రాను ఓటీటీ డిమాండ్ అంత‌కంత‌కు పెరుగుతోన్న‌స‌న్నివేశం క‌నిపిస్తుంది. భ‌విష్య‌త్ లో సినిమా పూర్తిగా ఓటీటీకే అంకిత‌మ‌వుతుంది అని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఈ నేప‌థ్య‌లో తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం కూడా ఓటీటీ ప్లాట్ ఫాం ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి రెడీ అవుతున్న‌ట్లు స‌మాచారం.

భార‌తీయ స‌మాజం..సంస్కృతి సంప్ర‌దాయాలు చూపించ‌డ‌మే ల‌క్ష్యంగా ప్ర‌భుత్వం ఈ ఓటీటీని స్థాపిస్తుందిట‌. వినోదంతో పాటు క‌రెంట్ అపైర్స్ ని కూడా అదే ఓటీటీలో చూపించ‌నున్నారుట‌. ఏడాది లేదా రెండేళ్ల పాటు ఉచితంగానే సేవ‌లు అందించ‌నుందిట‌. అటుపై స‌బ్ స్క్రిప్ష‌న్ చార్జీలు ఉంటాయ‌ని స‌మాచారం. అయితే ఈ ఓటీటీ అన్న‌ది ప్ర‌స్తుతం ఆలోచ‌నా ద‌శ‌లో ఉందా? సైలెంట్ గా లాంచ్ చేసి వ‌చ్చేస్తారా? అన్న‌ది తెలియ‌దు.

దీనికి సంబంధించి ప్ర‌భుత్వం వ‌ర్గాల నుంచి అధికారికంగా విష‌యం వెల్ల‌డిస్తే త‌ప్ప క్లారిటీ ఉండ‌దు. భార‌త్ లో ఓటీటీ కి ప్ర‌జ‌లంతా అల‌వాటు ప‌డిన సంగ‌తి తెలిసిందే. సినిమా చూడాలంటే థియేట‌ర్ కే వెళ్లి చూడాలి అన్న నిబంధన ప‌క్క‌న‌బెట్టి ఓటీటీలోనే సినిమాని ఆస్వాదిస్తున్నారు. భ‌విష్య‌త్ లో సినిమా నేరుగా ఓ టీటీలోనే రిలీజ్ అవుతుంది. ఇవ‌న్నీ దృష్టిలో పెట్టుకునే ప్ర‌భుత్వం కూడా ఓటీటీ మార్కెట్లో కి అడుగుపెడుతున్న‌ట్లు క‌నిపిస్తుంది.

Tags:    

Similar News