అయోధ్యలో అపోలో సేవలు.. సీఎంతో ఉపాసన భేటీ
రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల తన తాత కుటుంబ సభ్యులతో కలిసి రామ్ రాగ్ సేవ చివరి రోజు వేడుకల కోసం అయోధ్య రామమందిరాన్ని సందర్శించారు
రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల తన తాత కుటుంబ సభ్యులతో కలిసి రామ్ రాగ్ సేవ చివరి రోజు వేడుకల కోసం అయోధ్య రామమందిరాన్ని సందర్శించారు. అంతేకాదు ఈ విజిట్‌కి చాలా ప్రత్యేకత ఉంది. అక్కడ భక్తులకు సేవలందించేందుకు ఉపాసన స్వయంగా అపోలో ఆస్పత్రిని ప్రారంభించారు. అత్తమామలు, తాతయ్యతో కలిసి అయోధ్యకు వెళ్లిన ఉపాసన వారితో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాల్లో షేర్ చేసారు. అలాగే అయోధ్యలో యుపి సీఎం యోగి ఆధిత్యనాథ్ తో కలిసి దిగిన ఫోటోను కూడా షేర్ చేసారు.
రామ మందిర్‌లో 48 రోజులుగా సాగుతున్న రామరాగ్ సేవ మార్చి 10తో ముగిసింది. ఒక ఎంటర్ ప్రెన్యూర్ గా ఉపాసన తన బిజీ జీవితం మధ్య చారిత్రాత్మక ఆలయాన్ని సందర్శించడానికి కొంత సమయం తీసుకున్నారు. ఇంతకుముందే తన ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తన కామినేని కుటుంబంతో కలిసి ప్రయాణిస్తున్న ఫోటోను షేర్ చేసింది. 'అయోధ్య చలో' అనే క్యాప్షన్‌ను జోడించింది. అలాగే రామమందిరం ముందు ఆమె తన తాతను కౌగిలించుకున్న ఒక విలువైన క్షణానికి సంబంధించిన ఫోటోను కూడా షేర్ చేసింది. నా హృదయం నిండిపోయింది. ధన్యవాదాలు తాతా! అంటూ మురిసిపోయింది.
జనవరి 22న అయోధ్యలో విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రామ్ చరణ్.. తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి, తల్లి సురేఖ కొణిదెలతో కలిసి హాజరయ్యారు. ఆ సమయంలో ఉపాసన వారితో లేరు .. 48 సుదీర్ఘ భక్తి ఆచారాలు మరికొన్ని గంటల్లో ముగియబోతున్నందున ఇప్పుడు ఉపాసన ఆలయాన్ని సందర్శించారు.
రాముని దర్శనం.. అపోలో విస్తరణ:
అయోధ్య రాముడిని దర్శించుకోవడమే కాకుండా అక్కడ అపోలో హాస్పిటల్ కొత్త బ్రాంచిని ప్రారంభించిన ఉపాసన .. తాత ప్రతాప్ రెడ్డి లెగసీని ముందుకు సాగిస్తున్న వైనం ఆకర్షిస్తోంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ని కూడా కలుసుకొని.. రాష్ట్రంలో అపోలో సేవల గురించి తెలియజేసారు. అనంతరం తన తాత ప్రతాప్ రెడ్డి లెగసీని తెలియజేసే 'ది అపోలో స్టోరీ' పుస్తకాన్ని ముఖ్యమంత్రికి అందజేశారు.