దీపావళి సినిమాలు.. ఆ సెంటిమెంట్ తో ముందే..
మొత్తం ఐదు సినిమాలు.. ఈ ఏడాది దీపావళి పండుగ కానుకగా థియేటర్లో సందడి చేయనున్నాయి. అందులో మూడు స్ట్రయిట్ తెలుగు మూవీస్ కాగా.. రెండో డబ్బింగ్ చిత్రాలు ఉన్నాయి.
సినిమాలకు ఫెస్టివల్స్ కు మంచి కనెక్షన్ ఉన్న విషయం తెలిసిందే. పండుగల టైమ్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే సినిమాలపై ఆడియన్స్ స్పెషల్ ఫోకస్ ఉంటుంది. హాలీడేస్ కలిసి వస్తాయని.. ఫ్యామిలీతో థియేటర్లకు వెళ్లి మూవీస్ చూస్తుంటారు. అది టాక్ తో సంబంధం లేకుండా కొన్ని చిత్రాలకు ప్లస్ గా మారుతుంది. అయితే కొన్నేళ్ల నుంచి దీపావళిని కూడా పెద్ద సీజన్ గా పరిగణనలోకి తీసుకుంటున్నారు సినిమా వాళ్లు. పోటీపడి మరీ చిత్రాలు రిలీజ్ చేస్తున్నారు. ఈసారి కూడా అదే జరుగుతుంది.
మొత్తం ఐదు సినిమాలు.. ఈ ఏడాది దీపావళి పండుగ కానుకగా థియేటర్లో సందడి చేయనున్నాయి. అందులో మూడు స్ట్రయిట్ తెలుగు మూవీస్ కాగా.. రెండో డబ్బింగ్ చిత్రాలు ఉన్నాయి. టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ 'క'.. అక్టోబర్ 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్.. తెలుగులో నటిస్తున్న మరో స్ట్రయిట్ మూవీ లక్కీ భాస్కర్ కూడా అదే రోజు విడుదల కానుంది.
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న జీబ్రా మూవీ దీపావళి రేసులోనే ఉంది. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అందించిన కథతో రూపొందిన కన్నడ మూవీ భగీరా తెలుగు వెర్షన్ విడుదల కానుంది. కోలీవుడ్ యంగ్ హీరో శివ కార్తికేయన్, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన అమరన్ మూవీ కూడా రానుంది. అయితే దీపావళి పండుగను కార్తీక మాస అమావాస్య నాడు అంతా జరుపుకుంటారన్న విషయం తెలిసిందే.
పండుగే అయినా.. అమవాస్య కాబట్టి కొందరు కొత్త పనులు స్టార్ట్ చేయాలని అనుకోరు. ఇప్పుడు ఆ సెంటిమెంట్ నే దీపావళి చిత్రాల మేకర్స్ ఫాలో అవుతున్నారని వార్తలు వస్తున్నాయి. 30వ తేదీన ప్రీమియర్స్ వేయాలని ఫిక్స్ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ మేకర్స్.. 30వ తేదీ సాయంత్రం ప్రీమియర్స్ వేస్తామని ప్రకటించేశారు. కిరణ్ అబ్బవరం 'క'తో మరిన్ని చిత్రాల మేకర్స్ త్వరలోనే అనౌన్స్ చేయనున్నారని వినికిడి.
అమావాస్య సెంటిమెంట్ ను పక్కన పెడితే.. దీపావళి రోజు సెలవు కనుక 30వ తేదీ సాయంత్రం నుంచి ప్రీమియర్స్ వేస్తే సినీ ప్రియుల నుంచి మంచి రెస్పాన్స్ కచ్చితంగా వస్తుంది. ఆ తర్వాత రోజు కొందరు బిజీ అయిపోతారు. కాబట్టి ప్రీమియర్స్ కు అంతా అట్రాక్ట్ అయ్యి థియేటర్లకు తరలివచ్చే ఛాన్స్ ఉంది. పాజిటివ్ మౌత్ టాక్ వస్తే ఇంకేముంది.. ఆయా సినిమాలకు తిరుగుండదు. మరి ఏ ఏ మూవీల ప్రీమియర్స్ షోస్ పడతాయో? ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటాయో వేచి చూడాలి.