ఫోటో స్టోరి: హూ ఈజ్ మ్యాడమ్ బావట్ల్కీ?
తాజాగా తన కెరీర్ లో మరో క్రేజీ ఆఫర్ గురించి ఊర్వశి ఎంతో ఉబ్బితబ్బిబ్బవుతూ ప్రకటించింది. దీనికోసం అల్ట్రా స్టైలిష్ అవతార్ లో ప్రత్యక్షమై మతులు చెడగొట్టింది.
ఊర్వశి రౌతేలా పరిచయం అవసరం లేదు. మెగా బాస్ చిరంజీవితో కలిసి స్టెప్పులేసే అవకాశం దక్కించుకుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం దిల్ హై గ్రే - బ్లాక్ రోజ్ లాంటి భారీ చిత్రాల్లో నటిస్తోంది. జోసెఫ్ డి సామి రూపొందించనున్న ప్రాజెక్ట్‌లోను కూడా నటించనుంది. ఈ సినిమాకి టైటిల్ నిర్ణయించాల్సి ఉంది.
తాజాగా తన కెరీర్ లో మరో క్రేజీ ఆఫర్ గురించి ఊర్వశి ఎంతో ఉబ్బితబ్బిబ్బవుతూ ప్రకటించింది. దీనికోసం అల్ట్రా స్టైలిష్ అవతార్ లో ప్రత్యక్షమై మతులు చెడగొట్టింది. హూ ఈజ్ దిస్ మ్యాడమ్ బావట్ల్కీ? అంటూ నెటిజనులు ఈ లుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు.
ప్రతిసారీ అద్భుతమైన డ్రెస్సింగ్ సెన్స్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యపరచడంలో విఫలం కాని ఊర్వశి మరోసారి హెడ్ టర్నర్ గా మారింది. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ ఫోటోలు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. ఊర్వశి డ్యాషింగ్ ఫ్యాషన్ సెన్స్ మరోసారి చర్చనీయాంశంగా మారింది. స్లీవ్‌లెస్ లేటెక్స్ ఫాక్స్ లెదర్ బస్టియర్ స్లీవ్‌లెస్ మిడి దుస్తులను ధరించింది. ఈ రూపం బోల్డ్ అండ్ చిక్ వైబ్‌ని క్రియేట్ చేసింది. ఈ పింక్ కలర్ లెదర్ మిడీ దుస్తుల ధర రూ. 8,500. అమనా జ్యువెల్స్‌లోని ఉపకరణాలతో స్టైలిష్ దుస్తులను అలంకరించింది. ఈ డిజైనర్ ఆభరణాలు అధునాతనతను జోడించాయి. ఊర్వశి రూ. 5500 విలువైన మాక్సిమా షోల్డర్ డస్టర్ చెవిపోగులు, పాంగోలిన్ రింగ్ - మాక్సిమా రింగ్ లు ధరించగా ఒక్కొక్క రింగ్ ధర రూ. 2500. తన మణికట్టును రూ. 750 విలువైన స్కాలోప్ రిస్ట్ స్టాక్ 4 హ్యాండ్‌క్రాఫ్ట్ నగలతో అలంకరించుకుంది. దీనికి రూ. 6000 విలువైన ఒక అదనపు రిస్ట్‌వ్రాప్ ని యాడప్ చేసింది.
ఊర్వశి లుక్‌లోని హైలైట్ ఏంటి అంటే? అమనా జ్యువెల్స్ బ్రాండ్‌కు చెందిన కళ్లద్దాలను ఎంపిక చేసుకోవడం. పక్షి ఈక ఆకారపు ఫ్రేమ్‌తో పాటు బీట్స్ అటాచ్‌మెంట్‌తో కూడిన ప్రత్యేకమైన కళ్లజోడును ధరించింది. దీని వెల రూ. 35,000. కళ్లజోడు గ్లామర్‌ను జోడించడమే కాకుండా నవ్యపంథా ఫ్యాషన్‌పై ఊర్వశి ఎంపికలను, ప్రవృత్తిని ఎలివేట్ చేసింది. ఊర్వశి మెడాలియన్ గోల్డ్‌లో ఇన్ఫినిటీ నానో బ్యాగ్‌ని ఎంపిక చేసుకుంది. దీని ధర రూ. 6,000. బ్యాగ్ మినీ హార్ట్-ఆకారపు డిజైన్‌ను కలిగి ఉంది. మొత్తం వస్త్రధారణ ఊర్వశి లుక్ ని ప్రత్యేకంగా మార్చేసింది అనడంలో సందేహం లేదు. ఈ మొత్తం లుక్ కోసం ఏకంగా రూ. 70,000 పైగా ఖర్చు చేసింది.
ఊర్వశి రౌతేలా ఈ అలంకరణలో స్పెషల్ గా కనిపిస్తోంది. ధైర్యంగా సాహసోపేతమైన ఫ్యాషన్ ఎంపికల విషయంలో తన గట్ ఫీలింగ్ ని, సామర్థ్యాన్ని ప్రదర్శించింది. పరిపూర్ణమైన మేకప్, యాక్సెసరీల పరంగా శ్రద్ధ, మొత్తం రూపం పరంగా ఫ్యాషన్ ప్రపంచంలో ప్రత్యేకంగా నిలబెట్టాయి.
భారీ ప్రాజెక్ట్ లో ఇద్దరు స్టార్ హీరోలతో?
ఊర్వశిరౌతేల ప్రస్తుతం ఊటీలో షూటింగ్ లో ఉన్నారు. ఈ సందర్భంగా భారీ సినిమాలో అవకాశం కల్పించిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు తెలిపింది. ఊర్వశి మాట్లాడుతూ- "నేను ఇక్కడ ఊటీలో ఉన్నందుకు ఎంతో గౌరవంగా భావిస్తున్నాను అని కూడా తెలిపారు. నా తర్వాతి మెగా బడ్జెట్ చిత్రం షూటింగ్‌లో ఒకరు కాదు ఇద్దరు టాప్ స్టార్లతో కలిసి నటిస్తున్నాను. ఇద్దరు అద్భుతమైన సూపర్‌స్టార్లు & అల్ట్రా స్పెషలిస్ట్ దర్శకులతో కలిసి ప్రయాణం ప్రారంభించాను. ఈ అవకాశం కల్పించినందున నా హృదయం కృతజ్ఞతతో నిండి ఉంది . ఈ ప్రాజెక్ట్‌కు ప్రాణం పోసినందుకు నేను సంతోషిస్తున్నాను" అని వ్యాఖ్యానించారు.