'ఉరుకు పటేలా' ట్రైలర్.. ప్రేమలో సడన్ ట్విస్ట్

ఫన్నీ ఎలిమెంట్స్, థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో ట్రైలర్.. మూవీ లవర్స్ ను ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

Update: 2024-08-26 16:43 GMT

హుషారు మూవీతో మెప్పించి మంచి గుర్తింపు సంపాదించుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ తేజస్ కంచెర్ల.. నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఉరుకు పటేలా. గెట్ ఉరికిఫైడ్ ట్యాగ్ లైన్ తో రూపొందుతున్న ఆ మూవీ రిలీజ్ కు సిద్ధమవుతోంది. వివేక్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఆ సినిమాలో ఖుష్భూ చౌదరీ హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్ తోపాటు పట్నం పిల్లా, ఓరి మాయలోడా సాంగ్స్.. సినీ ప్రియులను మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.

సెప్టెంబర్ స్టార్టింగ్ లో ఉరుకు పటేలా మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో మేకర్స్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు. అందులో భాగంగా సోమవారం.. మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. అయితే ఉరుకు పటేలా సినిమాను పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించినట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. లవ్‌ స్టోరీతో పాటు హారర్ కామెడీ కూడా యాడ్ చేసినట్లు అర్ధమవుతోంది. దెయ్యంతో ప్రేమ ఎలా ఉంటుందో అనే కోణంలో కథను రాసుకున్నట్లు క్లియర్ గా తెలుస్తోంది.

అయితే సినిమాలో నిరక్షరాస్యుడు అయిన హీరో.. చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కలలు కనేవాడు. అనుకున్నట్లే అతడిని డాక్టర్ అయిన హీరోయిన్ లవ్ చేస్తుంది. దీంతో అంతా షాక్ అయిపోతారు. కానీ అప్పుడు హీరోయిన్ లోని మరో కోణం బయటపడుతుంది. అప్పుడు హీరో భయపడి పారిపోవాలనుకుంటాడు. అసలు ఏం జరిగింది? హీరోయిన్ లోని ఇంకో కోణం ఏంటి? చివరకు ఏమైందో తెలియాలంటే సినిమా చూడాలనుంటున్నారు ఉరుకు పటేలా మేకర్స్.

ఫన్నీ ఎలిమెంట్స్, థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో ట్రైలర్.. మూవీ లవర్స్ ను ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ప్రవీణ్ లక్కరాజు బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సన్నీ కుర్రపాటి విజువల్స్ ఫుల్ రిచ్ గా ఉన్నాయి. మూవీకి బిగ్ అసెట్ గా మారాయి. హీరోహీరోయిన్ల ఎనర్జీ అట్రాక్టివ్ గా ఉంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుంది. లవ్ స్టోరీ క్లిక్ అయినట్లు కనిపిస్తోంది. సినిమాలో తేజస్, చమ్మక్ చంద్ర మధ్య కామెడీ బాగానే వర్కౌట్ అయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తోంది.

లీడ్ ఎడ్జ్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌ పై కంచర్ల బాల భాను ఉరుకు పటేలా మూవీని నిర్మిస్తున్నారు. గ్రామీణ ప్రాంతంలో ప్రత్యేకమైన ఎంటర్టైనర్‌గా ఉంటుందని మేకర్స్.. ట్రైలర్ రిలీజ్ సందర్భంగా హామీ ఇచ్చారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి అయిందని, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లు మరోసారి వెల్లడించారు. మరి ఉరుకు పటేలా మూవీ.. ఆడియన్స్ ను ఎలా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

Full View
Tags:    

Similar News