డైరెక్టర్ పై అభిమానంతో హాట్ బ్యూటీ అలా!
బాలకృష్ణతో కలిసి అమ్మడు వేసిన స్టెప్పులకు థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. పాటతో పాటు కొన్ని సన్నివేశాల్లోనూ నటించే అవకాశం బాబి కల్పించాడు.
ఊర్వశీ రౌతేలా బాలీవుడ్ లో ఎన్నో సినిమాలు చేసింది. కానీ ఏ సినిమా తీసుకుని రాని ఎనలేని క్రేజ్ ను ఒక్క బాస్ పార్టీ సాంగ్ తో చేధించింది. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన `వాల్తేరు వీరయ్య`లో బాస్ పార్టీ అంటూ అమ్మడు చేసిన రచ్చ అంతా ఇంతా కాదుగా. ఆ పాటతో తెలుగులో ఓ రేంజ్ లో ఫేమస్ అయింది. అందులో ఛాన్స్ ఇచ్చింది దర్శకుడు బాబి. తాజాగా `డాకు మహారాజ్` లో `దబిడి దిబిడి` పాటతో ఇంకే రేంజ్ కి చేరుకుందో చెప్పా ల్సిన పనిలేదు.
బాలకృష్ణతో కలిసి అమ్మడు వేసిన స్టెప్పులకు థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. పాటతో పాటు కొన్ని సన్నివేశాల్లోనూ నటించే అవకాశం బాబి కల్పించాడు. ఇది అమ్మడికి అదనంగా కలిసొచ్చింది. తనని కేవలం ఐటం భామగానే చూడ కుండా ఊర్వశి ఇలాంటి పాత్రలు కూడా చేయగలదని ప్రూవ్ చేసింది. ఈ నేపథ్యంలో బాబికి అభిమానంతో ఓ లేఖ కూడా రాసింది. తనను నమ్మి అవకాశం ఇచ్చిన బాబికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసింది.
`డాకు మహారాజ్` కు పాజిటివ్ టాక్ రావడంతో? సంక్రాంతికి ఎలా లేదన్నా గట్టెక్కిస్తుంది. బాలయ్య మాస్ ఇమేజ్ ...`దబిడి దిబిడి` పాటతో ఊర్వశీ జనాల్ని థియేటర్ కు రప్పించగలరు? అన్న నమ్మకం ఏర్పడింది. ఊర్వశీ బాలీవుడ్ కెరీర్ చూస్తే `సింగ్ సాబ్ ది గ్రేట్` సినిమాతో అమ్మడు బాలీవుడ్ నటిగా ఎంట్రీ ఇచ్చింది.
ఆ వెంటనే కన్నడలోనూ లాంచ్ అయింది. `భాగ్ జానీ` సినిమాతో స్పెషల్ ఎంట్రీ షురూ చేసింది. `గ్రేట్ గ్రాండ్ మస్తీ`, `హేట్ స్టోరీ-4` సహా పలు హిందీ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో `బ్లాక్ రోజ్`, `వెల్కమ్ టూది జంగిల్`, ` కసూర్ -2` చిత్రాల్లో నటిస్తోంది. మరి కొత్త ఏడాది లో ఇంకేవైనా తెలుగు సినిమాలకు సైన్ చేస్తుందా? అన్నది చూడాలి.