ఏజ్ గ్యాప్ ఉన్నా ఇబ్బందేమి లేదంటున్న బోల్డ్ బ్యూటీ..!

ఆ టైం లో బాబీ తో తనకు 38 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉందని అంత ఏజ్ గ్యాప్ ఉన్న జోడీగా తనది ప్రత్యేకమైన రికార్డ్ అని అన్నారు ఊర్వశి.

Update: 2024-10-26 01:30 GMT

బాలీవుడ్ లో హా**ట్ బ్యూటీగా తన అందాలతో బీ టౌన్ ఆడియన్స్ ని తన వల్లో వేసుకున్న బ్యూటీ ఊర్వశి రౌతెల. అందంగా కనిపించడం కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేని ఈ అమ్మడు అలా తెర మీద కనిపిస్తే చాలు అమ్మడి గ్లామర్ ట్రీట్ కి ఆడియన్స్ అంతా ఫిదా అవుతుంటారు. అందుకే ఊర్వశి క్రేజ్ బాలీవుడ్ నుంచి సౌత్ ఇండస్ట్రీ దాకా పాకింది. ఓ పక్క హిందీలో స్పెషల్ సాంగ్స్ స్పెషల్ రోల్స్ చేస్తూ వస్తున్న ఊర్వశి రౌతెలా టాలీవుడ్ లో కూడా ప్రత్యేక గీతాల్లో అలరిస్తుంది.

చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలో బాస్ పార్టీ సాంగ్ తో అలరించింది అమ్మడు. ఆ సాంగ్ లో బాస్ స్టెప్పులతో పాటు ఊర్వశి అందాలు కూడా అడ్వాంటేజ్ లా నిలిచాయి. కెరీర్ లో హిట్లు ఫ్లాపులు అనే లెక్క కాకుండా తన పంథా కొనసాగిస్తున్న అమ్మడు లేటెస్ట్ గా ఏజ్ గ్యాప్ హీరోలతో నటించడం పట్ల తనకేమి ఇబ్బంది లేదని క్లారిటీ ఇచ్చింది. ఇండస్ట్రీలో కథానాయికల స్పాన్ చాలా తక్కువ అందువల్లే వచ్చిన ఛాన్స్ ని వాడుకోవాలని చూస్తారు.

ఐతే ఈ క్రమంలో సీనియర్ స్టార్ హీరోలతో నటించే ఛాన్స్ ఉంటుంది. అలాంటి టైం లో బయట హీరో హీరోయిన్ ల మధ్య ఏజ్ గ్యాప్ గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారు. కానీ ఎవరేం అనుకున్నా సరే ఇబ్బంది లేదంటుంది ఊర్వశి రౌతెల. రియల్ లైఫ్ లో తానేమి ఏజ్ ఎక్కువ ఉన్న వారితో డేటింగ్ చేయట్లేదుగా.. అయినా స్క్రీన్ మీద పాత్రల మధ్య ఏజ్ గ్యాప్ అన్నది పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అంటుంది ఊర్వశి. తన తొలి సినిమా సింగ్ సాబ్ ది గ్రేట్ సినిమా టైం లో తనకు 19 ఏళ్లు మాత్రమే అని ఆ టైం లో బాబీ డియో తో స్క్రీన్ షేర్ చేసుకున్నా అని గుర్తు చేశారు ఊర్వశి.

ఆ టైం లో బాబీ తో తనకు 38 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉందని అంత ఏజ్ గ్యాప్ ఉన్న జోడీగా తనది ప్రత్యేకమైన రికార్డ్ అని అన్నారు ఊర్వశి. హీరో హీరోల మధ్య ఏజ్ గ్యాప్ చూడాల్సిన పని లేదని చెప్పకనే చెప్పారు ఊర్వశి. ప్రస్తుతం ఆమె నందమూరి బాలకృష్ణ నటిస్తున్న సినిమాలో ఛాన్స్ అందుకుంది. కె ఎస్ బాబీ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా 2025 సంక్రాంతికి రిలీజ్ లాక్ చేశారు.

Tags:    

Similar News