కంటెంట్ ఉన్న దర్శకులతో వైష్ణవ్ కొత్త ప్రాజెక్టులు

చివరిగా వైష్ణవ్ తేజ్ నుంచి ఆదికేశవ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా దారుణంగా డిజాస్టర్ అయింది.

Update: 2024-12-18 09:56 GMT

మెగా యువ హీరోలందరూ కూడా వారికంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ తో ముందుకు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే రీసెంట్ గా వెండితెరకు పరిచయమైన మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ మాత్రం ఇంకా ఒక స్టాన్డెర్డ్ మార్కెట్ ను క్రియేట్ చేసుకోలేకపోయాడు. మొదటి నుంచి కూడా కాస్త డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలను చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఓకే ఫార్మాట్లో వెళ్లకుండా కమర్షియల్ కథలను కూడా టచ్ చేస్తూ ఉన్నాడు.

చివరిగా వైష్ణవ్ తేజ్ నుంచి ఆదికేశవ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా దారుణంగా డిజాస్టర్ అయింది. అతని మొదటి సినిమా ఉప్పెన ఏ స్థాయిలో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమాతో ఊహించని విధంగా 100 కోట్ల మార్కెట్ ను టచ్ చేసిన వైష్ణవ్ తేజ్ ఒక రికార్డును అయితే క్రియేట్ చేశాడు. ఇక ఆ తర్వాత అతనికి వెంట వెంటనే వరుసగా మూడు ప్రాజెక్టులలో నటించే అవకాశం లభించింది.

కొండ పొలం - రంగ రంగ వైభవంగా అనే సినిమాలను ఒకేసారి ఫినిష్ చేశాడు అయితే ఆ సినిమాలు కూడా డిజాస్టర్ అయ్యాయి. ఇక ఆది కేశవ డిసాస్టర్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ఈ యువ హీరో మళ్లీ కొత్త తరహా కథలను సెలెక్ట్ చేసుకునే విధంగా ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా మరో ఇద్దరు దర్శకులకు ఒకేసారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

ఉయ్యాల జంపాల - మజ్ను సినిమాలతో మంచి సక్సెస్ అందుకున్న యువ దర్శకుడు విరించి వర్మ తో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు. అతను రీసెంట్ గా జితేందర్ రెడ్డి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఆ సినిమా అంతగా సక్సెస్ కాలేదు. అలాగే టాలెంటెడ్ దర్శకుడు కృష్ణ చైతన్య దర్శకత్వంలో కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ను టచ్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

కృష్ణ చైతన్య ఇటీవల విశ్వక్ సేన్ తో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమా చేశాడు. ఈ సినిమా మేకింగ్ విధానానికి ప్రముఖుల ప్రశంసలు కూడా దక్కాయి. ఇక ఇప్పుడు వైష్ణవ్ కోసం అతను మరొక ప్రయోగాత్మకమైన కథను సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి కొంత గ్యాప్ తీసుకున్నా వైష్ణవ్ తేజ్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను సెట్స్ పైకి తీసుకురావడానికి డిసైడ్ అయ్యాడు. మరి ఈ సినిమాలతో అతనికి ఎలాంటి మార్కెట్ క్రియేట్ అవుతుందో చూడాలి.

Tags:    

Similar News