బేబీకి అర్జంట్ హిట్ పడాల్సిందే..?

బేబీ హిట్ లవ్ మీ ఫెయిల్ అవ్వడంతో ఇప్పుడు మళ్లీ హిట్ కొట్టే దాకా వైష్ణవి చైతన్య కెరీర్ కన్ ఫ్యూజ్ గానే ఉంటుంది.

Update: 2024-06-18 17:30 GMT

హీరోయిన్ గా చేసిన తొలి సినిమానే బ్లాక్ బస్టర్ పడితే ఆ క్రేజ్ వేరేలా ఉంటుంది. అది కూడా ఒక తెలుగు అమ్మాయి షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సీరీస్ లు చేస్తూ క్రేజ్ తెచ్చుకుని ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్ కి ప్రమోటై మొదటి సినిమా సక్సెస్ కొడితే ఆ లెక్క వేరేలా ఉంటుంది. ఆ సినిమా సక్సెస్ తో ఆమెను అందరు వారెవా అనేస్తుంటారు కానీ ఆ తర్వాత ఒక్క ఫ్లాప్ పడితే మాత్రం గ్రాఫ్ పడిపోయినట్టే చేస్తారు. హిట్టు ఇచ్చే కిక్ ఏనుగు అంత బలం ఇస్తే.. ఫ్లాప్ వస్తే మారం నీరసపడేలా చేస్తుంది. ప్రస్తుతం అలాంటి నిరుత్సాహం లోనే ఉంది తెలుగు హీరోయిన్ వైష్ణవి చైతన్య.

బేబీ సినిమాతో హీరోయిన్ గా చేసిన మొదటి అటెంప్ట్ తోనే బంపర్ హిట్ అందుకున్న అమ్మడు ఆ తర్వాత లవ్ మీ సినిమా చేయగా అది డిజప్పాయింట్ చేసింది. ఆశిష్ రెడ్డి హీరోగా చేసిన లవ్ మీ సినిమా దిల్ రాజు ప్రొడక్షన్ లో నిర్మించారు. అంత పెద్ద బ్యానర్ లో అవకాశం వస్తే కాదనే ఛాన్స్ లేదు. అందుకే వైష్ణవి లవ్ మీ చేసింది. ఐతే ఆ సినిమా ఫలితం అమ్మడి కెరీర్ ని డైలమాలో పడేసింది. బేబీ హిట్ లవ్ మీ ఫెయిల్ అవ్వడంతో ఇప్పుడు మళ్లీ హిట్ కొట్టే దాకా వైష్ణవి చైతన్య కెరీర్ కన్ ఫ్యూజ్ గానే ఉంటుంది.

Read more!

వైష్ణవి చైతన్య ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డతో జాక్ సినిమా చేస్తుంది. ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేస్తున్నారు. అఖిల్ తో బ్యాచిలర్ సినిమా తర్వాత గ్యాప్ తీసుకుని మరీ జాక్ మూవీ చేస్తున్న భాస్కర్ ఈ సినిమాతో కూడా మరో సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. ఐతే ఈ సినిమాలో వైష్ణవి నటించడం ఆమెకు కలిసి వచ్చే అంశమే అని చెప్పొచ్చు.

బొమ్మరిల్లు భాస్కర్ సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు మంచి వెయిట్ ఉంటుంది. అందుకే జాక్ సినిమాతో వైష్ణవి మళ్లీ ఫాంలోకి వస్తుందని అంటున్నారు. టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిల కెరీర్ కొన్నాళ్లు సక్సెస్ ఫుల్ గా కొనసాగాలి అంటే వారికి తగిన అవకాశాలు ఇవ్వాలి. బేబీతో యాక్టింగ్ లో తన టాలెంట్ చూపించిన వైష్ణవి చైతన్యకు సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా ఛాన్సులు ఇస్తే ఆమె ప్రతిభ చాటే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు.

Tags:    

Similar News