విశ్వంభరలో మెగా హీరో..?

మెగాస్టార్ విశ్వంభర సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ లో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటిస్తున్నాడని తెలుస్తుంది.

Update: 2024-06-06 05:51 GMT

మెగాస్టార్ చిరంజీవి వశిష్ట కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా విశ్వంభర. బింబిసార తో మొదటి సినిమానే సక్సెస్ అందుకున్న డైరెక్టర్ వశిష్ట ఈసారి మరో విజువల్ వండర్ తో ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేయాలని చూస్తున్నాడు. యువి క్రియేషన్స్ బ్యానర్ లో 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న విశ్వంభర సినిమా ఎక్కడ కాలిక్యులేషన్స్ తగ్గకుండా చూస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమాలో త్రిష తో పాటుగా మీనాక్షి చౌదరి, ఆషిక రంగనాథ్ నటిస్తున్నారని తెలిసి ఫ్యాన్స్ ఖుషి అవుతుండగా లేటెస్ట్ గా మెగా హీరో కూడా విశ్వంభరలో భాగం అవుతున్నాడని తెలిసి సర్ ప్రైజ్ అవుతున్నారు.

మెగాస్టార్ విశ్వంభర సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ లో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటిస్తున్నాడని తెలుస్తుంది. సినిమాలో ఆ పాత్ర చాలా కీలకం కాగా ఎవరైనా హీరో ఇమేజ్ ఉన్న వారు చేస్తే బాగుంటుందని డైరెక్టర్ అనుకోగా చిరు మన వైష్ణవ్ తేజ్ చేయిద్దామని సజెస్ట్ చేశారట. సో అలా మెగా విశ్వంభర సినిమాలో వైష్ణవ్ తేజ్ భాగం అవబోతున్నారని తెలుస్తుంది. ఉప్పెనతో హీరోగా తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వైష్ణవ్ తేజ్ ఆ తర్వాత మూడు సినిమాలు చేయగా అవి నిరాశపరిచాయి.

వైష్ణవ్ తేజ్ లాస్ట్ మూవీ ఆదికేశవ డిజాస్టర్ కా బాప్ అనిపించుకుంది. కెరీర్ పరంగా కాస్త డల్ గా ఉన్న వైష్ణవ్ తేజ్ కి మెగాస్టార్ సినిమా కచ్చితంగా కిక్ ఇస్తుందని చెప్పొచ్చు. సినిమాలో చేసేది చిన్న పాత్ర అయినా సరే దాని ఇంపాక్ట్ బాగా ఉంటుందని అంటున్నారు. మరి నిజంగానే చిరంజీవి విశ్వంభరలో వైష్ణవ్ తేజ్ నటిస్తున్నాడా లేదా అన్నది అఫీషియల్ గా త్వరలో తెలుస్తుంది.

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాతో భారీ టార్గెట్ ని పెట్టుకున్నాడు. వాల్తేరు వీరయ్య సక్సెస్ కొట్టిన చిరు భోళాశంకర్ తో ఫ్లాప్ ఫేస్ చేశాడు. ఐతే రీ ఎంట్రీ తర్వాత రొటీన్ సినిమాలు చేస్తున్నాడన్న విమర్శకులు ఎదుర్కొన్న చిరు విశ్వంభర సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో చూపించాలని ఫిక్స్ అయ్యారు. విశ్వంభర సినిమా ఇప్పటికే పూర్తయిన షూటింగ్ పార్ట్ చూసుకుని చిత్ర యూనిట్ చాలా సాటిస్ఫై డ్ గా ఉన్నారట. 2025 జనవరి 10న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Tags:    

Similar News