ఎట్టకేల‌కు ఆ కంబ్యాక్ బ్యూటీ ప్రేమ‌లో ప‌డిందా!

అందుకే ఇప్పుడు మ‌ళ్లీ తిరిగి అవ‌కాశాలు అందుకుంటుంది.

Update: 2024-10-11 17:30 GMT

బాలీవుడ్ టూ టాలీవుడ్...మ‌ళ్లీ టాలీవుడ్ టూ బాలీవుడ్ కి ఆ మ‌ధ్య ఓ స్టార్ హీరోయిన్ అటు ఇటు ఇలా జంపింగ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాతే మ‌ళ్లీ అమ్మ‌డు వెంట‌నే రియ‌లైజ్ అయిన మ‌ళ్లీ వెళ్లిన చోటుకే వ‌చ్చి వాలింది. అయితే ఈ ప్రోస‌స్ లో ఎక్కువ‌గా స‌మాయాన్ని వృద్ధా చేయ‌లేదు. ఫాంలో ఉన్న టైమ్ లోనే వెళ్లింది. ఆఫాం ఫేడౌట్ అవ్వ‌క ముందే జాగ్ర‌త్త ప‌డి వెంట‌నే కంబ్యాక్ అయింది. అందుకే ఇప్పుడు మ‌ళ్లీ తిరిగి అవ‌కాశాలు అందుకుంటుంది.

అయితే ఈ సారి మునుప‌టిలా కాకుండా కాస్త యాటిట్యూడ్ కూడా త‌గ్గించిన‌ట్లు క‌నిపిస్తుంది. ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల‌కు అందుబాటులో ఉండేలా? ఆలోచ‌న చేసి ముందుకు సాగుతుంది. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో ఆ బ్యూటీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విష‌యం లీకైంది. ఇంత‌వ‌ర‌కూ ఈ బ్యూటీ ఎవ‌రితోనూ ల‌వ్ లో ప‌డిన‌ట్లు ప్ర‌చారం కూడా రాలేదు. తెలుగు, త‌మిళం, హిందీలో సినిమాలు చేసింది గానీ ఏ హీరోతో డేటింగ్ చేసిన‌ట్లు గానీ, ప్రేమ పాఠాలు నేర్చుకుంటున్న‌ట్లు గానీ ఎక్క‌డా చిన్న గాసిప్ కూడా రాలేదు.

షూటింగ్ - ఇల్లు...ప‌బ్ త‌ప్ప ఇంకే వ్యాపకాలు పెట్టుకోలేద‌ని అర్ద‌మైంది. అయితే ఈ భామ మ‌న‌సు ఇప్పుడు ప్రేమ వైపు మ‌ళ్లిన‌ట్లు బాలీవుడ్ లో మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. బిగ్ బాస్ ఫేమ్, వ‌ర్ద‌మాన న‌టుడితో అమ్మ‌డు ల‌వ్ లో ఉన్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. ఇద్ద‌రు కొన్ని రోజులుగా చెట్టా ప‌ట్టాలేసుకుని తిరుగుతున్నారని, ముంబై వీధుల్లో నైట్ కెమెరాల‌కు చిక్కిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఆ ల‌వ్ ఈ మ‌ధ్య కాలంలోనే మొద‌లైంద‌ని అంటున్నారు.

ఇంత‌వ‌ర‌కూ సింగిల్ గా ఉన్నా? ఇప్పుడు మింగిల్ అయింద‌నే వార్త అమె అభిమానుల్లోనూ చ‌ర్చ‌కు దారి తీస్తోంది. ఇప్ప‌టికే ఆ అమ్మ‌డి వ‌య‌సు 33 ఏళ్లు నిండాయి. పెళ్లిచేసుకునే వ‌య‌సు కూడా. త‌ల్లిదండ్రులు కూడా సీరియ‌స్ గా సంబంధాలు చూసే స‌మ‌యం ఇది. అందుకే అమ్మ‌డు ముందుగానే ఇలా ప్రేమ అనుభూతిలో తేలుతోంది. మ‌రి అత‌గాడితో రిలేష‌న్ షిప్ పెళ్లి వ‌ర‌కూ తీసుకెళ్తుందా? ప్రేమ‌కే పరిమితం చేస్తుందా? అన్న‌ది చూడాలి.

Tags:    

Similar News