వరుణ్ సందేశ్ సతీమణికి మళ్లీ ఆ సమస్య రిపీట్!
మైగ్రేన్‌తో విపరీతమైన తలనొప్పి.. వెన్నునొప్పి కలుగుతున్నాయని.. ఫలితంగా ఏ పనీ చేయలేకపోతున్నానని పేర్కొంది
వరుణ్ సందేశ్ ఫ్యామిలీ లైఫ్ లో బిజీ అయినపోయిన సంగతి తెలిసిందే. వితికే షేర్ తో జీవితాన్ని పంచుకున్నప్పటికీ నుంచి ఫ్యామిలీ తప్ప మరో ధ్యాస లేదు. అప్పుడప్పుడు ఎంటర్ టైన్ మెంట్ ప్రోగ్రామ్స్ లో కనిపిస్తున్నాడు. కానీ సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్‌గా ఉంటాడు. వరుణ్ భార్య వితికా షేరూ కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్. సొంతంగా ఓ యూట్యూబ్ ఛానల్ కూడా నిర్వహి స్తున్నారు.
ఇటీవలే ఆ జంట బిగ్‌బాస్‌లో కనిపించి అభిమానులను అలరించింది. అయితే వితిక స్పాండిలైటిస్ సమస్యని మరోసారి తెరపైకి తెచ్చింది. తన యూట్యూబ్ ఛానల్లో ఈ విషయాన్ని రివీల్ చేసింది. తాను కొన్ని రోజులుగా స్పాండిలైటిస్ మైగ్రేన్‌తో బాధపడుతున్నట్టు ఆమె చెప్పుకొచ్చింది. మైగ్రేన్‌తో విపరీతమైన తలనొప్పి.. వెన్నునొప్పి కలుగుతున్నాయని.. ఫలితంగా ఏ పనీ చేయలేకపోతున్నానని పేర్కొంది. స్పాండిలైటిస్‌కు ఫిజియోథెరపీ చేయించుకుంటున్నట్టు తెలిపింది. ఇటీవలే నీడ్లింగ్ కూడా చేయించుకున్నట్టు వితిక పేర్కొంది.
నీడ్లింగ్తో రిలీఫ్ రావడంతో ప్రస్తుతం తన పనులు తాను చేసుకోగలిగే స్థితిలో ఉన్నానని చెప్పుకొచ్చింది. గత రెండు వారాలుగా ఈ సమస్య ఎదుర్కుంటున్నట్లు తెలిపింది. దీంతో వితిక అభిమానులు..పాలోవర్లు త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో కామెంట్లు పోస్టు చేస్తున్నారు. స్పాండిలైటిస్ సమస్యతో బాధపడుతున్నట్లు వితిక గతంలోనే తెలిపింది. ఇది శాశ్వత పరిష్కారం లేని సమస్య.
ఇలాంటి సమస్య సెలబ్రిటీల్లో చాలా మందికి ఉంది. మహేష్ కూడా మైగ్రేన్ తో చాలా కాలం పాటు బాధపడుతున్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అది ఎంత సమస్యగా ఉంటుందో వ్యక్తిగతంగా తానెంతో ఇబ్బంది పట్టారో రివీల్ చేసారు. దీనికి ప్రత్యేకంగా ట్రీట్ మెంట్ కూడా తీసుకున్నారు. యోగా.. వ్యాయామాలు...సరైన డైట్ వంటివి వాటితో కొంతవరకూ నివారించగలమని సూచించారు.