లావణ్య-వరుణ్ లవ్ అందుకే రహస్యంగా!
వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ప్రేమ..పెళ్లి చేసుకున్నారు? అన్నది ఇప్పటికీ షాకింగ్ గానే అనిపిస్తుంది.
వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ప్రేమ..పెళ్లి చేసుకున్నారు? అన్నది ఇప్పటికీ షాకింగ్ గానే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ జంట గురించి సోషల్ మీడియాలో ఎలాంటి లీక్ లేదు. ఇద్దరు ప్రేమించుకుంటున్నట్లు గానీ...కలిసి దిగిన ఫోటోలు షేర్ అవ్వడం గానీ ఎక్కడా జరగలేదు. దీంతో వీళ్లిద్దరి మధ్య లవ్ ఎలా కుదిరిం ది? అన్న సంగతి ఆ జోడీ చెప్పేవరకూ ఎవరికీ తెలియదు. అదీ ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న ఒక్క గాసిప్ కూడా రాకపోవడం అన్నది ఆశ్చర్యంగానే అనిపిస్తుంది.
మరి ప్రేమ విషయంలో ఆ జోడీ అంత సీక్రెట్ ఎందుకు వహించాల్సి వచ్చింది. ప్రేమించుకోవడంలో తప్పే ముంది? ఆ విషయం అభిమానులకు తెలిస్తే వచ్చిన నష్టమేముంది? అంటే వరుణ్ తేజ్ సమాధా నం ఇలా ఉంది. ఓ సినిమా ప్రమోషన్ లో భాగంగా వరుణ్ తేజ్ ఆ విషయాల గురించి తొలిసారి ఓపెన్ అయ్యాడు.`సినీ ఇండస్ట్రీలో ప్రతి విషయాన్ని ప్రేక్షకులు అభిమానులు తెలుసుకోవాలనుకుం టారు. అలా మా బంధం గురించి మాట్లాడుకోవడం మాకు ఇష్టం లేదు. అందుకే మా ప్రేమ గురించి ఎవరికీ చెప్పలేదు.
మొదట్లో బ్యాలెన్స్ చేయడం కష్టంగా ఉన్నా చివరికి సాధ్యమైంది. అందులోనూ సమస్యలున్నాయి. కొన్ని సందర్భా ల్లో ఒత్తిడి తగ్గించుకోవడానికి స్వేచ్ఛగా ఎటైనా వెళ్లాలనుకునే వాళ్ళం. కానీ సాధ్యపడేది కాదు. చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు సాధించాలి. విజయవంతమైన సినిమాలు చేయాలని నిర్ణయించు కున్నాం. దాంతో ఇద్దరం కెరియర్‌పై దృష్టి పెట్టాలనుకున్నాం. అదే సరైన నిర్ణయం అనిపించింది.` అని అన్నాడు.
ప్రస్తుతం వరుణ్ తేజ్ `ఆపరేషన్ వాలంటైన్` సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీగా ఉన్నాడు. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించిన సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఎయిర్ పోర్స్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. అలాగే `మట్కా` అనే మరో డిఫరెంట్ చిత్రంలోనూ వరుణ్ తేజ్ నటిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వరుణ్ తేజ్ కెరీర్ లో భారీ బడ్జెట్ చిత్రమని తెలుస్తోంది.