VD 12: మళ్ళీ ఇన్ని రోజులకు..

విజయ్ దేవరకొండ మూవీని పక్కన పెట్టి గౌతమ్ ఓ చిన్న బడ్జెట్ మూవీని స్టార్ట్ చేశాడనే టాక్ కూడా వినిపించింది. అయితే ఈ వార్తలలో ఎలాంటి వాస్తవం లేదని తెలుస్తోంది.

Update: 2024-01-02 12:03 GMT

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ స్టార్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. దిల్ రాజు భారీ బడ్జెట్ తో మూవీ చేస్తున్నారు. నిజానికి సంక్రాంతికి ఈ మూవీని రిలీజ్ చేయాలని దిల్ రాజు ప్లాన్ చేశారు. అయితే షూటింగ్ ఆలస్యం కావడంతో వాయిదా పడింది.

విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ కంటే ముందుగానే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో మూవీని ఎనౌన్స్ చేశారు. షూటింగ్ ఫస్ట్ షెడ్యుల్ కూడా స్టార్ట్ చేశారు. మళ్ళీ ఏమైందో సడెన్ గా దానిని ఆపేసి పరశురాం సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళిపోయారు. ఫస్ట్ షెడ్యూల్ లో షూట్ చేసిన సీక్వెన్స్ కూడా మొత్తం క్యాన్సిల్ చేసి కొత్తగా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారని తెలుస్తోంది.

గత కొంతకాలం నుంచి ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్ రాలేదు. హీరోయిన్ శ్రీలీల కూడా మూవీ నుంచి తప్పుకుందనే ప్రచారం నడిచింది. విజయ్ దేవరకొండ మూవీని పక్కన పెట్టి గౌతమ్ ఓ చిన్న బడ్జెట్ మూవీని స్టార్ట్ చేశాడనే టాక్ కూడా వినిపించింది. అయితే ఈ వార్తలలో ఎలాంటి వాస్తవం లేదని తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి అప్డేట్ వచ్చింది.

మూవీ షూటింగ్ తిరిగి స్టార్ట్ చేయనున్నారంట. ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ గుంటూరు కారం రిలీజ్ ప్రమోషన్స్ లో ఉన్నారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ కూడా సితారలో తెరకెక్కుతోంది. ఈ మూవీ రిలీజ్ ఏప్రిల్ లో జరగనుంది. ఇక VD 12 కోసం రౌడీ స్టార్, శ్రీలీల ఏప్రిల్ తర్వాత కాల్షీట్స్ ఇచ్చారంట. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేయడానికి గౌతమ్ సిద్ధం అవుతున్నారంట.

చిన్న సినిమా చేస్తున్నారనే దాంట్లో ఎలాంటి వాస్తవం లేదని తెలుస్తోంది. ఇక గౌతమ్ తన సినిమాలో విజయ్ ని పోలీస్ ఆఫీసర్ గా చూపించబోతున్నాడు. పీరియాడిక్ జోనర్ లో ఈ మూవీ కథాంశం ఉంటుందంట. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లోనే ఈ సినిమాని నాగవంశీ నిర్మిస్తున్నారు.

Tags:    

Similar News